EX CM: మాజీ సీఎం మనుమరాలు సౌందర్య ఆత్మహత్య, దంపతులు ఇద్దరూ డాక్టర్లు, పనిమనిషి చూసి !
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్, యడియూరప్ప ఇంట్లో విషాదచాయలు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మనుమరాలు సౌందర్య (30) బెంగళూరులోని ఆమె నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసు అధికారులు అన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన బీఎస్. యడియూరప్ప ఇటీవల కాలంలో ఆయన కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. యడియూరప్ప రెండో కుమార్తె పద్మావతి కుమార్తె సౌందర్య ఆత్మహత్య చేసుకోవడంతో బీఎస్. యడియూరప్ప కుటుంబ సభ్యులు హడలిపోయారు. ఆత్మహత్య చేసుకున్న సౌందర్య, ఆమె భర్త బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో డాక్టర్లుగా పని చేస్తున్నారు.

యడియూరప్పకు ముద్దుల మనుమరాలు
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడియూరప్ప చక్రం తిప్పిన విషయం తెలిసిందే. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి బీఎస్. యడియూరప్ప శక్తి వంచన లేకుండా పని చేశారు అనే విషయం అందరికి తెలిసిందే. బీఎస్ యడియూరప్ప రెండో కుమార్తె పధ్మావతి కుమార్తె సౌందర్య (30) అంటే బీఎస్ యడియూరప్పకు ఎంతో ఇష్టం అని ఆయన సన్నిహితులు అంటున్నారు.

డాక్టర్ తో సౌందర్య పెళ్లి
బీఎస్ యడియూరప్ప మనుమరాలు డాక్టర్ సౌందర్యకు, జిల్లా పంచాయితీ సభ్యుడు మరిస్వామి అన్న కుమారుడు డాక్టర్ నీరజ్ కు 2018 లో వివాహం జరిపించారు. బెంగళూరు నగరంలోని ప్రముఖ ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో డాక్టర్ నీరజ్ అసిస్టెంట్ ప్రోఫెఫర్ గా, డాక్టర్ సౌందర్య డాక్టర్ గా పని చేస్తున్నారు.

హడలిపోయిన కుటుంబ సభ్యులు
డాక్టర్ నీరజ్, డాక్టర్ సౌందర్యకు ఓ పాప ఉంది. బెంగళూరు నగరంలోని వసంతనగర్ లోని మౌంట్ కార్మల్ అపార్ట్ మెంట్ లో డాక్టర్ నీరజ్, సౌందర్య దంపతులు నివాసం ఉంటున్నారు.శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో డాక్టర్ నీరజ్ ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో బీఎస్. యడియూరప్ప మనుమరాలు సౌందర్య ఇంట్లోనే ఉన్నారు.

పనిమనిషి వెళ్లి చూస్తే శవమైన సౌందర్య
ఇంట్లోనే ఉంటున్న సౌందర్య ఆమె తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. ఉదయం 10 గంటల సమయంలో ఇంటి పనిమనిషి వెళ్లి చూడగా సౌందర్య ఫ్యాన్ కు వేలాడుతున్న విషయం గుర్తించి ఆమె భర్త డాక్టర్ నీరజ్ కు విషయం చెప్పింది. సమాచారం తెలుసుకున్న బీఎస్. యడియూరప్పతో పాటు ఆయన కుటుంబ సభ్యులు హడలిపోయారు.
Recommended Video

యడియూరప్ప ఇంటికి పరుగు తీసిన సీఎం బసవరాజ్ బోమ్మయ్
హైగ్రౌండ్స్ పోలీసులు సంఘటనా స్థానికి చేరుకుని పరిశీలించి సౌందర్య మృతదేహాన్ని శివాజీనగర్ లోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, పలువురు సీనియర్ మంత్రులు బీఎస్. యడియూరప్ప ఇంటికి పరుగు తీశారు, బీఎస్. యడియూరప్ప మనుమరాలు సౌందర్య ఆత్మహత్యకు కచ్చితమైన సమాచారం తెలీదని మాజీ సీఎం సన్నిహితులు అంటున్నారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
గరుడ పురాణం ప్రకారం "భార్య" ఎన్ని రకాలు ఉంటారో తెలుసా..? -
నంద్యాలలో కిల్లర్ వైఫ్.. ప్రియుడిమోజులో భర్తను అలా.. -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications