కెమెరాకు చిక్కారు: రేప్ విక్టింకు మాజీ 7కోట్ల ఆఫర్!

బాబూలాల్‌కు చెందిన ఓ అనుచరుడు అత్యాచార బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు రూ.ఏడు కోట్ల లంచం ఇవ్వబోతు పట్టుబడ్డాడు. ఈ వీడియోను బాధితురాలి తనయుడు సోమవారం కోర్టులో ప్రవేశ పెట్టారు.
మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఇప్పటికే మంత్రి పదవి పోగొట్టుకున్న బాబూలాల్ నగర్ వీడియో దెబ్బతో కాంగ్రెస్ పార్టీ వేటుకు గురయ్యారు. ఆయనను పార్టీ అధిష్టానం సోమవారం కాంగ్రెసు నుండి సస్పెండ్ చేసింది.
35 ఏళ్ల మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అధికారిక భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపినట్లు 53 ఏళ్ల బాబూలాల్‌పై ఆరోపణలున్నాయి. సెప్టెంబర్ 11న ఈ ఘటన వెలుగులోకి రాగా 19న ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఈ కేసులో విచారణ కొనసాగుతుండగానే ఆయన ప్రధాన అనుచరుడొకరు బాధితురాలి ఇంటికి వెళ్లి కేసు వాపస్ తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు. ఏడు కోట్లు ఇవ్వజూపాడు. మరోవైపు ఇదంతా ప్రత్యర్థుల కుట్ర అని, తనకేం సంబంధం లేదని బాబూలాల్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications