సార్ట్ ఇండియా మాజీ చీఫ్ భార్య ఇంద్రాని అరెస్టు
ముంబై: స్టార్ ఇండియా మాజీ చీఫ్ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాని ముఖర్జియాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఒక హత్య కేసు విషయంలో ఇంద్రాని ముఖర్జీయా మీద ఆరోపణలు రావడంతో ముంబై పోలీసులు అమెను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
సోదరి హత్య కేసులోనే ఇంద్రాని ముఖర్జియా ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. 2012లో ఇంద్రాని సోదరి షీనా బోరా హత్యకు గురైయ్యింది. ఆమె మృతదేహం కుళ్లిపోయిన తరువాత పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

షీనా బోరా మృతదేహాన్ని తరలించడంలో ఇంద్రాని సహాయపడిందని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే షీనా బోరా హత్యకు కచ్చితమైన కారణాలు ఇప్పటి వరకు తెలియడం లేదని పోలీసులు అంటున్నారు.
ఇంద్రాని ముఖర్జియాతో పాటు వారి ఇంట్లో డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈనెల 31వ తేది వరకు ఇంద్రాని, డ్రైవర్ ను విచారణ చెయ్యడానికి పోలీసు అధికారులు కస్టడిలోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications