కేరళలో కొత్త బిజినెస్: మెడికల్ షాప్ ముసుగులో మద్యం విక్రయం!

బెంగళూరు: మెడికల్ స్టోర్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. గుట్టుచప్పుడు కాకుండ రోగులకు ఔషదాలతో పాటు మందు బాబులకు మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

కేరళలోని కాసరగూడులోని బందేడు పేటలో బెస్ట్ మెడికల్ స్టోర్ ఉంది. ఉదయ్ కుమార్ (40) అనే వ్యక్తి బెస్ట్ మెడికల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. అయితే నగదు సంపాధించాలని ఆశతో ఇతను రోగులకు ఔషదాలు విక్రయించే ముసుగులో మందు బాబులకు మద్యం విక్రయిస్తున్నాడు.

Excise department seize medical store in Bandiyod, kasaragod for illegal liqour sale

వైన్ షాప్ ల కోసం చాల దూరం వెళ్లే ఓపిక లేని మందు బాబులు బెస్ట్ మెడికల్ స్టోర్ లో మద్యం కొనుగోలు చేసి జల్సా చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాసరగూడు పోలీసులు మఫ్టీలో వెళ్లి మాకు మద్యం కావాలని ఉదయ్ కుమార్ ను అడిగారు.

అయితే వచ్చింది పోలీసులు అని తెలియకపోవడంతో ఉదయ్ కుమార్ దర్జాకు లోపల ఉన్న మద్యం తీసుకు వచ్చి పోలీసులకు ఇచ్చాడు. రెడ్ హ్యాడెడ్ గా ఉదయ్ కుమార్ ను పట్టుకున్న పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. చాల కాలం నుంచి ఉదయ్ కుమార్ మెడికల్ స్టోర్ ముసుగులో మద్యం విక్రయిస్తున్నాడని కాసరగూడు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+