టైమ్స్ నౌ సర్వే-మళ్లీ మోడీయే కావాలి: బీజేపీకి 318 సీట్లు, ప్రశ్నలు-సమాధానాలు ఇలా..
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, గత నాలుగేళ్లుగా వరుసగా విజయాలు సాధిస్తున్న బీజేపీ, కొన్ని ఎన్నికల్లో అపజయాల బాట పట్టింది. మోడీ నాలుగేళ్ల పాలన నేపథ్యంలో క్రోమ్ డాటా అనలటిక్స్ అండ్ మీడియా ఓ ఒపీనియన్ పోల్ సర్వే నిర్వహించింది.
ఈ సర్వేలో ఎనిమిది ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నల ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రజల తీరు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. మోడీ ప్రభుత్వాన్ని సగం కంటే ఎక్కువ మంది మళ్లీ కోరుకుంటున్నారు. ఇప్పుడు కనుక లోకసభ ఎన్నికలు జరిగితే బీజేపీకి 318 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. 2014లో బీజేపీ గెలిచింది 282 మాత్రమే.

2019లో ప్రధానిగా ఎవరు?
2019లో మీరు ప్రధానిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు?
నరేంద్ర మోడీ - 53% | రాహుల్ గాంధీ - 23% | మమతా బెనర్జీ- 7% | అఖిలేష్ యాదవ్- 6% | మాయావతి- 5% | అరవింద్ కేజ్రీవాల్- 1% | ఇతరులు- 3%

మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి
ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు?
అవును- 55% | కాదు- 45%

ఇంటర్ ఫెయిత్ రిలేషన్‌పై అభిప్రాయం
గత నాలుగేళ్లలో ఇంటర్ ఫెయిత్ రిలేషన్ ఎలా ఉందని భావిస్తున్నారు?
పెరిగింది- 30% | అలాగే ఉంది - 32% | బాగాలేదు - 23% | ఏం చెప్పలేం- 15%

ఉద్యోగం, ఆదాయ భద్రత
మీ ఉద్యోగం, ఆదాయ భద్రత ఎలా ఉంది?
ఐదేళ్ల క్రితం లాగే ఉంది - 31% | ఎన్డీయే ప్రభుత్వంలో పెరిగింది - 37% | గతంలో కంటే దారుణంగా ఉంది - 32%

జీవన ప్రమాణాలపై ప్రభావం
గత నాలుగేళ్ళు మీ జీవన ప్రమాణాలను ఎలా ప్రభావితం చేశాయి?
బాగా పెరిగింది - 19% | కొంత పెరిగింది- 28% | గతంలోలాగే ఉంది - 23% | బాగా లేదు - 14% | చాలా దారుణంగా ఉంది - 11% | చెప్పలేం - 5%

నాలుగేళ్ల ప్రభుత్వం రేటింగ్
నాలుగేళ్ల మోడీ ప్రభుత్వానికి మీరు ఏ రేటింగ్ ఇస్తారు?
చాలా బాగుంది- 23% | బాగుంది - 26% | మామూలుగానే ఉంది- 27% | బాగాలేదు- 24%
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications