Skiping: స్కిప్పింగ్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
కూర్చుని ఉద్యోగం చేసేవారు తప్పుకుండా వ్యాయామం చేయాలి లేకుంటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తప్పువు. ముఖ్యంగా పట్టణాల్లో ఉండే ఉద్యోగులు తప్పుకుండా వ్యాయామం చేయాలి. ఊళ్లలో అంటే వారు వ్యవసాయం చేస్తారు కాబట్టి వారికి వ్యాయామం చేయకున్నా నడుస్తుంది. కానీ పట్టణాల్లో మాత్రం వర్కవుట్స్ చేయాల్సిందే. మన ఇంట్లోనే ఈజీగా, ఎక్కువ హంగామా లేకుండా చేసే వర్కవుట్స్‌లో స్కిప్పింగ్ ఒకటి. స్కిప్పింగ్ వల్ల ఫిట్‌నెస్‌కే కాదు.. మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

1300 క్యాలరీలు
బరువు తగ్గాలనుకునే వారికి స్కిప్పింగ్ ఎంతో సహాయపడుతుంది.స్కిప్పింగ్ వల్ల శరీరంలో ఉన్న అదనపు కేలరీలు కరిగిపోతాయట. స్కిప్పింగ్ కూడా ఒక లాంటి వ్యాయామమేనని నిపుణులు చెబుతున్నారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు స్కిప్పింగ్ ను చేస్తే మంచి ఫలితాలను ఉంటాయని వివరిస్తున్నారు. ప్రతిరోజూ ఓ గంటపాటు స్కింపింగ్ 1300 క్యాలరీలు ఖర్చవుతాయట. ఓ పది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం వల్ల ఒక కిలో మీటర్ పరిగెత్తిన దాంతో సమానమని నిపుణులు వివరిస్తున్నారు.

జిమ్ము అవసరం లేదు
స్పిప్పింగ్ చేసే మొదట్లో బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం అలవాటు పడిపోతుంది. స్కిప్పింగ్ చేయడం వల్ల రోజంతా హుషారుగా ఉంటారు. కొంతమంది జిమ్ములకు వెళ్లి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే సమయం లేక కొంతమంది వ్యాయామం చేయరు. వారు స్కిప్పింగ్ చేస్తే సరిపోతుందట. జిమ్ముల్లో చేసే వర్కవుట్స్‌లో కష్టపడి చెమటలు చిందించే వారు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో.. స్కిప్పింగ్ వల్ల కూడా అన్ని ప్రయోజనాలను పొందుతారని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడి
స్కిప్పింగ్ గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందట. స్కిప్పింగ్ వల్ల హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుందట. స్కిప్పింగ్ చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గే అవకాసం ఉందట. స్కిప్పింగ్ చేస్తే మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్ల ఉత్పత్తి చేస్తుంది. ఎండార్పిన్లు తో మానసికంగా ఉల్లసంగా ఉంటారట.












Click it and Unblock the Notifications