బెంగళూరుకు దగ్గరలో పవర్ ఫుల్ టెంపుల్: ఇప్పుడు మూసేస్తే మళ్లీ తెరిచేది సంవత్సరం తర్వాతే
కర్ణాటకలోని హాసన్ లో కొలువుదీరిన హాసనాంబ అమ్మవారి ఆలయం తలుపులు తెరచుకున్నాయి. సంవత్సరంలో 15 రోజులు మాత్రమే ఈ ఆలయం తెరిచివుంటుంది. మిగిలిన అన్ని రోజులూ మూసే ఉంటుంది. దసరా తర్వాత ఆలయం తలుపులు తెరచుకుంటాయి. దీపావళి తర్వాత మూతపడతాయి. ఈ ఏడాది ఈ నెల 9వ తేదీన హాసనాంబ అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తోన్నారు. మళ్లీ ఈ నెల 22వ తేదీన తలుపులను మూసివేస్తారు.
అతి కొద్దిరోజులు మాత్రమే అమ్మవారు దర్శనం ఇస్తోన్న నేపథ్యంలో భక్తులు పోటెత్తుతున్నారు. తొలి రోజు ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పించారు. మిగిలిన రోజుల్లో వారికి అవకాశం ఉండదు. అన్ని రోజులు సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తారు. 12వ శతాబ్దంలో హోయసళ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణ శైలి హొయసళ చరిత్రను ప్రతిబింబించేలా ఉంటుంది. దుర్గా దేవి ఇక్కడ హాసనాంబగా వెలిశారు.

ఆలయం మూసివేయడానికి ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించడం ఆనవాయితీ. దానితో పాటు తాజా పువ్వులు, వండిన అన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు. సంవత్సరం తర్వాత మళ్లీ ఆలయాన్ని తెరిచినప్పుడు, నెయ్యి దీపం వెలుగుతూనే ఉంటుంది. పువ్వులు అప్పట్లాగే తాజాగా ఉంటాయి. ప్రసాదం ఏ మాత్రం చెడిపోకుండా అలాగే ఉంటుంది. అమ్మవారి మహిమాన్వితమైన దర్శనానికి ఇది ప్రతీకగా భావిస్తారు భక్తులు.
ఇక్కడ అమ్మవారికి రూపం ఉండదు. ఆలయంలోని మూల విగ్రహాల్లో ఒకటి ప్రతి సంవత్సరం కూడా ప్రధాన విగ్రహం వైపు కదులుతుంటుందని నమ్ముతారు. ఎప్పుడైతే ఇది ప్రధాన విగ్రహాన్ని తాకుతుందో.. అప్పుడు కలియుగం అంతమౌతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. హసనాంబ దేవి, శ్రీ సిద్ధేశ్వరస్వామి జాతర మహోత్సవాలు ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత మహాపూజతో తలుపులను మూసివేస్తారు.
- హసనాంబ దేవి దర్శనం కోసం భక్తులు ఆన్‌లైన్ లో టికెట్ల కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది 25 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా. ఉచిత దర్శనంతో పాటు, క్యూలలో రద్దీని తగ్గించి, భక్తులకు సులభమైన దర్శనం కల్పించేందుకు ఆన్‌లైన్ టికెట్ కొనుగోలు వ్యవస్థను ఏర్పాటు చేశారు.
- హాసనాంబ ఆలయం వెబ్‌సైట్: http:srihassanaambatemple.com వెబ్‌సైట్‌ను సందర్శించి, చాట్‌బాట్ లింక్ ద్వారా సమాచారం పొందవచ్చు. దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
- హాసనాంబ యాప్: శ్రీ హాసనాంబ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఐఫోన్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని నేరుగా దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
- వాట్సాప్ చాట్‌బాట్ సిస్టమ్: 6366105589 నంబర్‌కు Hi అని వాట్సాప్‌లో మెసేజ్ పంపడం ద్వారా నేరుగా మీ దర్శన టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు.
- టికెట్ ధరలు: ప్రస్తుతం రెండు రకాల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక దర్శనానికి రూ. 1000. మరొక దర్శనానికి రూ. 300. ఒక్కో భక్తుడు ఒక్కో టికెట్ కొనుగోలు చేయాలి. అయిదేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టికెట్ తప్పనిసరి.
- బెంగళూరు నుంచి 188 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. బెంగళూరు నుంచి కేెఎస్ఆర్టీసీ బస్సుల్లో హాసన్ వరకు వెళ్లొచ్చు. జిల్లా కేంద్రం కావడం వల్ల హాసన్ కు ఎన్నో బస్సులు అందుబాటులో ఉన్నాయి. రైలు ద్వారా వెళ్లాలనుకుంటే బెంగళూరు నుంచి నేరుగా హాసన్ చేరుకోవచ్చు.
-
బెంగళూరులో ఈవీలు నడిపే వారికి బిగ్ షాక్ -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications