ఏంటీ దుస్థితి: 6.05శాతంకు పడిపోయిన ఎగుమతులు..ఇంకెప్పుడు చక్కబడేది...?

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడంతో దేశ ఎగుమతులు గతేడాది ఆగష్టు నెలతో పోలిస్తే ఈ ఏడాది 6.05శాతంకు అంటే 26.13 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు అధికార గణాంకాలు వెల్లడించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదునెలల్లోనే మొత్తం ఎగుమతులు 9శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే ఆగష్టులో వాణిజ్య పరంగా చాలా తక్కువగా నష్టపోవడం ప్రభుత్వానికి కాస్త ఊరటనిచ్చే అంశమైంది. తగ్గిపోయిన ఎగుమతులను దృష్టిలో ఉంచుకుని ఈ సారి 19 శాతం నుంచి 20శాతంకు పెంచేలా లక్ష్యంగా పెట్టుకుని 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను స్థాపించాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన 24 గంటల్లోనే అధికారిక లెక్కలు వెలువడటం కలవర పెడుతోంది.

ఈ నెల జూన్‌కు గత 41 నెలల్లో ఎప్పుడూ లేని విధంగా ఎగుమతుల వృద్ధి రేటు భారీగా పడిపోయింది. విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోలియం ఆయిల్, వజ్రాలు, నగలు, ఇంజినీరింగ్ పరికరాల్లో తగ్గుదల స్పష్టంగా కనిపించింది. ఇక దిగుమతులు కూడా గత 34 నెలల్లో ఎప్పుడూ లేని విధంగా 9.06శాతానికి పడిపోయాయి. వాణిజ్య లోటు జూన్లో దాదాపు ఎనిమిది శాతం తగ్గి 15.28 బిలియన్ డాలర్లకు చేరుకుంది, ఇది మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.

Export growth have dropped by 6.05 per in August:Official data

Recommended Video

    Gems And Jewellery Exports Have Continued The Downfall || రత్నాలు,నగల ఎగుమతుల్లో మందగమనం

    ఇక ఆగష్టు నెలలో ఆయిల్ ఎగుమతులు 8.9 శాతానికి పడిపోయి 10.88 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆయిలేతర ఉత్పత్తుల ఎగుమతులు 15శాతానికి పడిపోయి 28.71 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక జెమ్స్, నగలు, ఇతర ఇంజనీరింగ్ వస్తువుల్లో ఎగుమతుల రేటు నెగిటివ్‌గా కనిపిస్తోంది. ఇక ఏప్రిల్-ఆగష్టు 2019 వరకు చూస్తే ఎగుమతులు 1.53శాతం పడిపోయి 133.54 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇక దిగుమతులు కూడా 5.68 శాతంకు తగ్గిపోయి 206.39 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇక పండుగ సమయం సమీపిస్తుండగా ...బంగారం ధరల దిగుమతి 62.49శాతంకు పడిపోయి 1.36 బిలియన్ డాలర్లకు చేరకున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+