yogi Adityanath: ఎగుమతుల హబ్‍గా యూపీ:యోగి ఆదిత్యనాథ్
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) కార్యక్రమం ప్రతి జిల్లా ఉత్పత్తులను ప్రమోట్ చేయడమే కాకుండా, ప్రపంచ మార్కెట్‌కు యాక్సెస్‌తో పాటు కొత్త డిజైన్‌ను కూడా అందిస్తోందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శుక్రవారం లక్నోలోని లోక్ భవన్‌లో విశ్వకర్మ శ్రమ సమ్మాన్ యోజన కింద జరిగిన అవార్డు, టూల్‌కిట్ పంపిణీ కార్యక్రమంలో యోగి పాల్గొన్నారు. ODOP U.P MSME రంగానికి వెన్నెముకగా మారిందన్నారు. ఇది మొత్తం దేశంలో స్వావలంబనకు నాంది పలికిందని చెప్పారు. నాల్గో పారిశ్రామిక విప్లవం (పారిశ్రామిక విప్లవం 4.0) టార్చ్ బేరర్‌గా ఉత్తరప్రదేశ్ ఉద్భవించనుందని తెలిపారు.
ఫిబ్రవరిలో లక్నోలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో అందుకున్న రూ. 35 లక్షల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను బట్టి ఇది స్పష్టమవుందన్నారు. "రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర బిందువు దాని 96 లక్షల MSMEలు (సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)" అని ముఖ్యమంత్రి చెప్పారు. MSME ఉత్పత్తులను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్రంలో డిజైనింగ్, ప్యాకేజింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఈ అవార్డు కార్యక్రమంలో పన్నెండు మందికి సంత్ కబీర్ స్టేట్ హ్యాండ్లూమ్ అవార్డు, 34 సంస్థలకు స్టేట్ ఎక్స్‌పోర్ట్ అవార్డు, 20 మందికి MSME లభించాయి. విశ్వకర్మ శ్రమ సమ్మాన్ యోజన కింద శిక్షణ పొందిన 75,000 మంది కళాకారులకు టూల్‌కిట్‌లు, సర్టిఫికెట్లు అందించారు.
ప్రపంచ స్థాయిలో రాష్ట్రంలోని హస్తకళాకారులకు ODOP గౌరవాన్ని తెచ్చిపెట్టిందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ నేడు ఎగుమతుల హబ్‌గా ఆవిర్భవించిందని చెప్పారు.
2017కి ముందు ఎగుమతులు కేవలం రూ.86,000 కోట్లు మాత్రమేనని, ఇప్పుడు అది రూ.2.5 లక్షల కోట్లకు పెరిగిందని ముఖ్యమంత్రి యోగి తెలిపారు. విశ్వకర్మ శ్రమ సమ్మాన్ యోజనతో బ్యాంకులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా చేతివృత్తిదారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఆర్థిక సహాయం పొందవచ్చని ఆయన చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బ్యాంకర్లతో విశ్వకర్మ శ్రమ సమ్మాన్ యోజనకు సంబంధించిన కళాకారుల సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications