వైరల్ వీడియో: ఎంత జాగ్రత్తగా ప్రియుడ్ని దాచిందో..? ఊపిరి ఎలా ఆడింది రా సామి..
ఇన్నాళ్లు పెళ్లంటే నూరేళ్ల పంట అనేవాళ్లు పెద్దలు. కానీ ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. భార్యాభర్తలు ఒకర్నొకరు చీట్ చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు ప్రధాన కారణంగా మారుతోంది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను చంపేస్తున్నారు. లేదా తమకు విడాకులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అటు భర్తలూ అంతకుమించి మృగంలా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలే విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. తాజాగా మరొక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Husband caught his wife's lover hiding inside the bed 😂😭pic.twitter.com/o3PZQctMah
— Ambar (@Ambar_SIFF_MRA) September 24, 2025
భర్తకు తెలియకుండా ఓ మహిళ తన ప్రియుడ్ని ఎంత జాగ్రత్తగా దాచిందో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. పూర్వం కట్టె మంచాలు ఉండేవి. మంచం కింద ఏమి ఉన్నా సులభంగా కనిపించేది. కానీ ట్రెండ్ మారింది. ఇప్పుడు డబుల్ కాట్ బెడ్లు వచ్చేశాయి. బెడ్లకే సెల్ఫ్ లు, సామాను సర్దుకోవడానికి భారీగా స్థలం కూడా ఇస్తున్నారు. వీటిని పాత కాలం మంచాల మాదిరి ఎత్తి పక్కన పెట్టలేం. అయితే ఇదే అదనుగా భావించిన ఆ మహిళ.. తన ప్రియుడ్ని ఎవరికీ అనుమానం రాకుండా బెడ్ కింద ఉన్న ప్లేస్ లో దాచింది. అలా అయితే భర్తకు కూడా అనుమానం రాదని భావించింది.

అయితే ఎట్టకేలకు భర్త.. వీరి బాగోతాన్ని గుర్తించాడు. తన కుటుంబ సభ్యులతో వెళ్లి బెడ్ ఓపెన్ చేయగా బెడ్ కింద ప్రియుడు ప్రత్యక్షమయ్యాడు. దాంతో కర్రలతో అతడ్ని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినవాళ్లు ఊపిరి ఎలా ఆడింది రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాడికి కఠినంగా శిక్షించాలని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. భర్త.. నువ్వు ఎప్పుడు వచ్చావ్.. అంటే.. అందరికంటే ముందు నేనే వచ్చా అని అతడు చెప్తున్న మీమ్ ను ఈ వీడియోకు యాడ్ చేశారు. ఈ క్రమంలో యువత పెళ్లంటేనే బయపడి పోతున్నారు.












Click it and Unblock the Notifications