ఏఏపీకి మరో షాక్: వాలంటీర్‌తో విశ్వాస్‌కు ఫిజికల్ రిలేషన్?

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో ఇప్పటికే విభేదాలు రచ్చకెక్కాయి. వాటితో ఆ పార్టీ సతమతమవుతోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత కుమార్ విశ్వాస్‌కు సంబంధించిన షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన విషయం ఆంగ్ల మీడియాలో జోరుగా వినిపిస్తోంది.

లోకసభ ఎన్నికల సమయంలో కుమార్ విశ్వాస్ ఓ వాలంటీర్‌తో పడుకున్నాడని, అలాగే నల్లధనం విషయాన్ని అంగీకరించారని జోరుగా ప్రచారం సాగుతోంది. అజయ్ వోహ్రా అనే వ్యక్తి తమకు చేసిన ఈ మెయిల్స్ కాపీలు ఉన్నాయని ఓ ఆంగ్ల మీడియా బాంబు పేల్చింది.

2014 లోకసభ ఎన్నికల్లో కుమార్ విశ్వాస్ అమేథి నుండి పోటీ చేశాడు. ఆ సమయంలో అతను ఓ వాలంటీర్‌తో గడిపాడని చెబుతున్నారు. అంతేకాదు ఆ వాలెంటీర్‌తో ఉండగా కుమార్ విశ్వాస్ తన భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడని, అనంతరం రాజీ కుదుర్చుకున్నాడని చెప్పినట్లుగా తెలుస్తోంది.

 #ExposingKumarVishwas: Did AAP leader sleep with a volunteer, accept black money?

అయితే, ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తాను బహిరంగ పర్చలేదని అతను చెప్పాడని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన క్లిప్‌ను పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఇతర పార్టీ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ తదితరులకు మెయిల్ చేశారనని అతను చెప్పాడని సమాచారం.

దీనిపై ఎలాంటి విచారణ జరగలేదని అతను ఆరోపించాడని తెలుస్తోంది. అయితే, ఈ ప్రచారాన్ని కుమార్ విశ్వాస్ కొట్టి పారేశాడని సమాచారం. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇదంతా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+