పట్టాలు తప్పి గుడిలోకి దూసుకెళ్లిన రైలు... పూజారితో సహా ఐదుగురికి గాయాలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో రైలు పట్టాలు తప్పి ఓ దేవాలయంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పూజారితో పాటు ఐదుగురు గాయపడ్డారు. గ్వాలియర్ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన సంభవించింది.
స్ధానికులు తెలిపిన కథనం ప్రకారం గ్వాలియర్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ మొదట ఓ చెట్టును ఢీకొనడంతో అది విరిగిపోయి గుడిపై పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రైలు గుడిని ఢీనకొనడంతో చాలా వరకు ధ్వంసమైంది.
ఈ ఘటనలో పూజారి రామ్ నివాస్ శర్మ (50)తో పాటు గుడి లోపల కూర్చున్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గుడి పూర్తిగా దెబ్బతింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో రైలు కోచ్‌లను ఫ్లాట్ ఫామ్ నెంబర్ 4కు సమీపంలో ఉన్న యార్డ్ వద్ద ఆపి ఉంచారని గవర్నమెంట్ రైల్వే పోలీసు ఎఎస్ఐ కెఎల్ రవి తెలిపారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని సస్పెండ్ చేయాలంటూ రైల్వే కార్మికులు స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించి ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications