వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖం చాటేసిన ఫేస్ బుక్ ఓనర్..! మార్క్‌ జుకర్‌బర్గ్‌కు పదవి గండం..!!

|
Google Oneindia TeluguNews

శాన్‌ఫ్రాన్సిస్కో/హైదరాబాద్ : ఫేస్ బుక్ అధినేతకు ఇప్పుడు ముఖం లేకుండా పోయింది. ఫేస్ బుక్ ద్వారా ఎన్నో సంచలనాలు నమోదు చేసిన దాని ఓన్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వైదొలిగే పరిస్థితి నెలకొంది. నేడు జరిగే సంస్థ వార్షిక సమావేశంలో లీడర్‌షిప్‌ ఓటు ద్వారా మార్క్‌ జుకర్‌బర్గ్‌కు సవాల్‌ ఎదురవనుంది.

గోప్యత నిబంధనల ఉల్లంఘనలను జుకర్‌బర్గ్‌ నాయకత్వంలో ఎఫ్‌బీ దీటుగా ఎదుర్కోలేకపోతోందని వాటాదారుల్లో అసంతృప్తి ఎటు దారితీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.కాగా కంపెనీ షేర్లలో జుకర్‌బర్గ్‌కు 60 శాతం వాటా ఉండటంతో లీడర్‌షిప్‌ ఓటులో ఆయన నాయకత్వానికి ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకావని బీబీసీ పేర్కొంది. జుకర్‌బర్గ్‌కు వ్యతిరేకంగా ఎంతశాతం వాటాదారులు ఓటు వేశారనేది ఆయన నాయకత్వానికి గీటురాయి కానుందని తెలిపింది.

Face Book Owner.! Mark Zuckerberg to resign to his post..!!

జుకర్‌బర్గ్‌ చైర్మన్‌గా వైదొలగాలని 70 లక్షల డాలర్ల విలువైన షేర్లు కలిగిన ట్రిలియమ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రతిపాదించింది. ఫేస్‌బుక్‌ సెక్యూరిటీ మాజీ చీఫ్‌ అలెక్స్‌ స్టామోస్‌ కూడా జుకర్‌బర్గ్‌ చైర్మన్‌గా వైదొలగాలని కోరుతున్నారు. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై నియంత్రణను జుకర్‌బర్గ్ కొంత వదులుకుని, నూతన సీఈఓను నియమించాలని కోరారు.

English summary
There is a lot of sensations through Face Book that seems to be in trouble now. Mark Zuckerberg has left the position of Facebook chairman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X