టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్ కేసులో మారన్ సోదరులు విచారణ ఎదుర్కోవలసిందే: సుప్రీంకోర్టు

దశాబ్దం క్రితం నాటి బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందే అని కళానిధి మారన్ , కేంద్ర టెలికాం మాజీ మంత్రి దయానిధి మారన్‌లకు సుప్రీం కోర్టు సూచించింది. దయానిధి మారన్, కళానిధి మారన్‌లపై కేసు కొట్టివేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు రద్దు చేస్తూ ఆ కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. 12 వారాల్లో విచారణ పూర్తి చేసి వారిపై అభియోగాలను నమోదు చేయాలని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మారన్ సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే జూలై 30న త్రిసభ్య ధర్మాసనం మారన్ సోదరుల పిటిషన్‌ను కొట్టివేసింది. తమ వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వకుండానే హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించడాన్ని కళానిధి మారన్ తప్పుబడుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Face trail in telephone exchange case says Supreme Court to Maran Brothers

హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కళానిధిమారన్ సుప్రీంకోర్టును కోరారు.దీంతో ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో కలగజేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు.. విచారణ ఎదుర్కోవాల్సిందేనని జస్టిస్ గొగోయ్ సూచించారు. దీంతో పిటిషన్ కొట్టివేశారు. ఈ ఏడాది మార్చిలో దయానిధి మారన్ సోదరుడు కళానిధి మారన్ ఈ కేసులో ఇతర నిందితులను సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా పేర్కొంది. కేసులో ప్రాథమిక ఆధారాలు లేనందున సీబీఐ కోర్టు మారన్ సోదరుల పిటిషన్‌ను విచారణచేసి వారని నిర్దోషులుగా ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+