రివైండ్ 2016: ఈ ఏడాది టాప్ సోషల్ మీడియా అంశాలివే!
తమ తమ సంస్థల్లో ఏయే అంశాలు పాపులర్ అయ్యాయో ఆయా సోషల్ మీడియా సంస్థలు ఈ ఏడాది ముగుస్తున్న సందర్భంగా వెల్లడించాయి.
హైదరాబాద్: ఇటీవల కాలంలో సోషల్ మీడియా అంటే తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదనిపిస్తోంది. ఎందుకంటే.. పెద్దల నుంచి స్కూల్ పిల్లల వరకూ తెల్లారిరితే చాలు.. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ అంటూ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో మునిగితేలుతున్నారు.
సోషల్ మీడియా ద్వారా తమ వ్యక్తిగత, సామాజిక, తదితర అంశాలను తమకు తెలిసిన వారితో పంచుకుంటూ.. వారి నుంచి ఇతర సమాచారాన్ని పొందుతున్నారు. అయితే, ఈఏడాది సోషల్ మీడియాలో పలు అంశాలు పాపులర్ అయ్యాయి. తమ తమ సంస్థల్లో ఏయే అంశాలు పాపులర్ అయ్యాయో ఆయా సంస్థలు ఏడాది ముగుస్తున్న సందర్భంగా వెల్లడించాయి.

ఫేస్‌బుక్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. 166 మిలియన్ల యూజర్లలో నెలలో 159 మిలియన్ మంది యూజర్లు ఆక్టివ్‌గా ఉంటున్నారు. 85మిలియన్ల మంది యూజర్ల రోజూ ఆక్టివ్‌గా ఉంటున్నారు. వీరు ఎక్కువగా మొబైల్స్‌లోనే ఫేస్ బుక్ చూస్తుండటం గమనార్హం. దీపావళి(దివాళీ) ఫేస్‌బుక్ ఈ యేడాది పాపులర్ అంశంగా మారింది. కాలుష్యానికి కారణమవుతుందంటూ చాలా మంది దీపావళి గురించి ప్రచారం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో క్రికెట్, యూరీ దాడి, సర్జికల్ స్ట్రైక్స్ ఉన్నాయి. ఈ అంశాలపై ఎక్కువగా సంభాషణలు చోటు చేసుకున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా యూఎస్ అధ్యక్ష ఎన్నికలు, బ్రెజిలియన్ పాలిటిక్స్, పోకేమన్ గోలు ఫేవరేట్ టాపిక్‌లుగా ఉన్నాయి. తొలిసారి టాప్ 10 లైవ్ వీడియోలను ప్రసారం చేసింది ఫేస్ బుక్. ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్‌పై అజాజ్ అహ్మద్ చెప్పిన పాఠం వీడియోను 9.2 మిలియన్ల మంది వీక్షించారు. 285కె రియాక్షన్స్ వచ్చాయి. రెండోస్థానంలో లైవ్ చాట్ విత్ సోనాక్షి సిన్హా ఉంది. ఈ వీడియోకి 6.9మిలియన్ల వ్యూస్, 573రియాక్షన్స్ వచ్చాయి.
ఇండియాలో టాప్ 10 ఫేస్‌బుక్ టాపిక్స్
1. దీపావళి(దివాళి)
2. క్రికెట్
3. యూరీ దాడులు, సర్జికల్ స్ట్రైక్స్
4. మహేంద్ర సింగ్ ధోనీ(మూవీ)
5. హార్డ్‌వెల్(ఇండియా టూర్)
6. ప్రియాంక చోప్రా
7. రియో ఒలింపిక్స్
8. పోకేమన్ గో
9. పఠాన్‌కోట్
10. ఐఫోన్ 7 లాంచ్
భారత్‌లో టాప్ 10 ఫేస్‌బుక్ లైవ్ వీడియోస్
1. https://www.facebook.com/ajaz.qamer/videos/1769859169954467/
2. https://www.facebook.com/sonakshisinhaofficial/videos/10154155457904701/
3. https://www.facebook.com/AmitabhBachchan/videos/1440239589343159/
4. https://www.facebook.com/IamSRK/videos/1660059270686996/
5. https://www.facebook.com/aajtak/videos/10154902993692580/
6. https://www.facebook.com/KajolDevgan/videos/1756974501230484/
7. https://www.facebook.com/BollywoodTabloidOfficial/videos/1183974758358529/
8. https://www.facebook.com/aajtak/videos/10154980331897580/
9. https://www.facebook.com/AAPkaArvind/videos/1129804343783728/
10. https://www.facebook.com/AjayDevgn/videos/1067612059943103/
టాప్ 10 ఫేస్‌బుక్ గ్లోబల్ మూమెంట్
1. యూస్ అధ్యక్ష ఎన్నికలు
2. బ్రెజిలియన్ పాలిటిక్స్
3. పోకేమన్ గో
4. బ్లాక్ లైవ్స్ మ్యాటర్
5. రోడ్రిగో డ్యూటెర్టె , ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నిక
6. ఒలింపిక్స్
7. బ్రెగ్జిట్
8. సూపర్ బౌల్
9. డేవిడ్ బౌలే
10. ముహమ్మద్ అలీ
టాప్ 10 ఫేస్‌బుక్ గ్లోబల్ లైవ్ వీడియోస్
1. Candace Payne, Chewbacca Mom
2. Ted Yoder, Soundscapes
3. Buzzfeed, Countdown to the next presidential election
4. Atlanta Buzz, People are lining up to hug police officers in Dallas
5. NBC News, Election results
6. Under the Hood, Video of a truck completely carved out of wood
7. Viral Thread, Population count from US to CA
8. CNN, Election results on Empire State building
9. Dena Blizzard, Pokemon Go for moms "Chardonnay Go"
10. Super Deluxe, Election map
ఇండియాలో మోస్ట్ ఇన్‌స్టాగ్రామ్డ్ లొకేషన్
1. మెరైన్ డ్రైవ్, ముంబై
2. తాజ్‌మహల్
3. హౌజ్ ఖాస్ గ్రామం, న్యూఢిల్లీ
4. జుహు బీచ్, ముంబై
5. ఇండియా గేట్, న్యూఢిల్లీ
6. బాగా బీచ్, గోవా
7. కన్నౌట్ ప్యాలేస్, న్యూఢిల్లీ
8. సెలెక్ట్ సిటీవాక్, న్యూఢిల్లీ
9. గోల్డెన్ టెంపుల్, అమృత్‌సర్, పంజాబ్
10. నంది హిల్స్, బెంగళూరు
ఇండియా నుంచి మోస్ట్ యూస్డ్ హాస్టాగ్స్
#love
#instagood
#fun
#india
#instagram
#picoftheday
#instapic
#instadaily
#instalike
#photooftheday
భారత్‌లో మోస్ట్ ఇన్‌స్టాగ్రామ్ డేస్
10/30/16-దీపావళి, దీపాల పండగ
11/14/16- చిల్డ్రెన్స్ డే
10/11/16- దసరా, చెడుపై మంచి విజయం
ఇక ట్విట్టర్ విషయానికొస్తే..
నల్లధనం, నకిలీ కరెన్సీని పూర్తిగా నిర్మూలించేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తూ నవంబరు 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ఈ ఏడాది ట్విట్టర్‌లో అత్యంత ప్రాముఖ్యంగల అంశంగా నిలిచింది. మోడీ ఈ నిర్ణయం ప్రకటించిన 24గంటల వ్యవధిలోనే 6.50లక్షల ట్వీట్లు వచ్చాయని.. దీనిపై తర్వాత వారంలో కొన్ని మిలియన్ల ట్వీట్లు వచ్చినట్లు ఆ కంపెనీ వెల్లడించింది.
ఆ తర్వాత స్థానాల్లో టాప్ మోస్ట్ ట్వీట్లు
-బాలీవుడ్ నటి అనుష్కశర్మకు మద్దతుగా క్రికెటర్ విరాట్ కోహ్లి చేసిన ట్వీట్ 2016లో 'గోల్డెన్ ట్వీట్'గా నిలిచింది. ఆమెతో విడిపోవడం వల్లే కోహ్లి బాగా ఆడుతున్నాడంటూ కొందరు అభిమానులు ట్వీట్ చేయగా కోహ్లి వారికి సమాధానంగా.. అనుష్కకు మద్దతుగా చక్కటి సమాధానంతో ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
-రియో ఒలింపిక్స్‌లో మెరిసిన పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ ట్విట్టర్ ద్వారా మిలియన్ల మంది హృదయాలను దోచుకున్నారు. 'రియో 2016 హ్యాష్‌ట్యాగ్' ట్రెండ్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచింది.
-ట్విట్టర్‌లో టాప్ 10 హ్యాష్‌ట్యాగ్‌ల్లో ఏడు క్రీడలకు సంబంధించినవే ఉండటం గమనార్హం. రియో 2016 ఒలింపిక్స్, డబ్ల్యూటీ20 హ్యాష్‌ట్యాగ్స్ ఎక్కువగా వచ్చాయి.
-ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా పథకానికి సంబంధించిన 'హ్యాష్‌ట్యాగ్ మేక్‌ఇన్‌ఇండియా' ఈ ఏడాది ట్విట్టర్ టాప్‌లో మోస్ట్ పాపులర్‌గా నిలిచింది.
-ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అత్యధిక మంది అనుసరిస్తున్నారు. డిసెంబరు 5 నాటికి ఆయన్ని 25.2మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ ఒక్క ఏడాదే ఆయన్ని 8.8 మిలియన్ల మంది అనుసరించారు.
-మోడీ తర్వాతి స్థానంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ 23.8 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలవగా, షారుఖ్ ఖాన్ 22.4 మిలియన్లు, అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా 15.7 మిలియన్ ఫాలోవర్లతో తదుపరి స్థానాల్లో ఉన్నారు.
- ఈ ఏడాది కొత్తగా గణతంత్ర దినోత్సవం రోజున విలక్షణ నటుడు కమల్‌హాసన్ ట్విట్టర్‌లో చేరారు. కమల్ హాసన్ జాతీయ గీతాన్ని పాడుతున్న వీడియోను ఆయన తన తొలి ట్వీట్‌గా చేశారు. కేవలం 24 గంటల్లోనే ఆయన్ని 30వేల మంది అనుసరించారు.
మన దేశంలో ఎక్కువ ట్విట్టర్ ఫాలోవర్లు ప్రధాని మోడీకి ఉన్నారు. ఆయనకు మొత్తం 2.46 కోట్ల ట్విట్టర్ ఫాలోవర్లు ఉండగా, తరువాతి స్థానాల్లో వరుసగా అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్‌లు నిలిచారు. వీరికి 2.34 కోట్లు, 2.21 కోట్ల ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్నారు.












Click it and Unblock the Notifications