గుర్గావ్‌లో అమెరికా అమ్మాయిని రేప్ చేసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్
గుర్గావ్: గుర్గావ్‌లోని ఓ అతిథి గృహంలో 16 ఏళ్ల అమెరికా జాతీయురాలిపై అత్యాచారం జరిగింది. ఆఫ్రికా సంతతికి చెందిన 21 ఏళ్ల వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గురువారం రాత్రి పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు. కరస్పాండెన్స్ ద్వారా విద్యనభ్యసిస్తున్న బాధితురాలు తన తల్లితో కలిసి ఇక్కడ నివసిస్తున్నట్లు గుర్గావ్ పోలీసు అధికార ప్రతినిధి రాజేష్ కుమార్ చెప్పారు.

బాధితురాలు తనను కలిసిన వ్యక్తిని డేవిడ్‌గా గుర్తించింది. అతను ఫేస్‌బుక్ ద్వారా ఆమెతో పరిచయం పెంచుకుని స్నేహం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు మార్చి 17వ తేదీన తనను సెక్టార్ 38లోని అతిథి గృహానికి తీసుకుని వెళ్లాడని, అక్కడ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.
ఎయిమ్స్‌లో బాధితురాలికి వైద్య పరీక్షలు చేశారు. ఆమె అత్యాచారానికి గురైనట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇందుకు సంబంధించి గురువారంనాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే, పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. బాధితురాలి కుటుంబం దర్యాప్తునకు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications