ఫేస్ బుక్ లో చాటింగ్ మానేసిందని.. ఇంత ఘోరానికి ఒడిగట్టాడు

ఇండోర్ : మారుపేరుతో ఫేస్ బుక్ లో ఓ అమ్మాయితో మాటలు కలిపిన ఓ వ్యక్తి.. తీరా ఆ అమ్మాయి అతడి గురించి నిజం తెలుసుకునేసరికి సహించలేకపోయాడు. ఏకంగా ఆమె ఇంటికే వెళ్లి.. విషయంపై నిలదీసి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డొచ్చిన ఆమె తల్లిపై కూడా సదరు నిందితుడు కత్తితో దాడికి ఒడిగట్టాడు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ ఘటన వెలుగుచూసింది. ఇండోర్ నగరానికి చెందిన అమిత్ యాదవ్ (24) 'అధర్వ' పేరుతో ఫేస్ బుక్ లో ఓ నకిలీ ఖాతా తెరిచాడు. అదే ఖాతా ద్వారా ప్రియా రావత్ (17) అనే అమ్మాయితో మాటలు కలిపాడు. ఇలా కొన్నాళ్లపాటు ఇద్దరి మధ్య చాటింగ్ సాగాక.. అసలు నిజం తెలుసుకున్న ప్రియా రావత్ అతడితో చాటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టింది.

Facebook friend posing as woman murders teenage girl in Indore

దీంతో తీవ్ర అసహనంతో రెచ్చిపోయిన అమిత్ యాదవ్.. నేరుగా గీతానగర్ లోని ప్రియా రావత్ ఇంటికెళ్లి విషయంపై నిలదీశాడు. దీంతో 'నీ ఐడీ పేరు చూసి అమ్మాయి అనుకుని చాటింగ్ చేశానని, అసలు నువ్వెవరో నాకు తెలియదని' అమిత్ తో చెప్పింది ప్రియా. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన అమిత్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియాపై దాడిచేశాడు.

ఇంతలో ప్రియా తల్లి అతన్ని అడ్డుకునే ప్రయత్నంతో చేయడంతో.. తల్లీకూతుళ్లు ఇద్దరూ అమిత్ చేతిలో గాయపడ్డారు. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఇక దాడి అనంతరం తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా రెండో అంతస్తు నుంచి దూకేయడంతో అమిత్ రెండు కాళ్లు విరిగినట్టుగా పోలీస్ అధికారి రాజేంద్ర తెలిపారు. అమిత్ యాదవ్ మతిస్థిమితం కూడా సరిగా లేదని తమ విచారణలో తేలినట్టు పోలీసులు పేర్కొనడం గమనార్హం. ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+