Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

4 గంటల్లో పెళ్లి.. ఆ ఇద్దరు ఒక్కటయ్యారు ఇలా..!

కోల్‌కతా : డిజిటల్ యుగంలో సోషల్ మీడియా హవా వేరే చెప్పనక్కర్లేదు. ఫుడ్డు తినాలన్నా.. బెడ్డు కొనాలన్నా.. అంతా డిజిటల్ రూపమే. అరచేతిలో ప్రపంచం చూస్తున్న ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలు కీ రోల్ పోషిస్తున్నాయి. ఆ క్రమంలో బ్లడ్ రిలేషన్స్ ఏమో గానీ.. ఫ్రెండ్ షిప్ మాత్రం బలపడుతోంది. ఇక ఫేస్‌బుక్ లాంటి వేదికలు ఎక్కడెక్కడి వారినో కలుపుతున్నాయి. కొందర్ని దగ్గర చేస్తున్నాయి. ఇద్దర్నీ ఒక్కటి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ పరిచయం కాస్తా పెళ్లికి దారి తీసిన ఘటన వైరల్‌గా మారింది. పెళ్లి కామనే కదా అనుకోవచ్చు.. కానీ ఆ బంధం నిలబడిన తీరు చూస్తే మాత్రం విస్తుపోవాల్సిందే.

ఫేస్‌బుక్ పరిచయం పెళ్లికి దారి తీసింది.. కేవలం 4 గంటల్లో వివాహం

ఫేస్‌బుక్ పరిచయం పెళ్లికి దారి తీసింది.. కేవలం 4 గంటల్లో వివాహం

కోల్‌కతాలో దసరా పండుగ నాడు దుర్గామాత ఆశీస్సులతో జరిగిన ఓ పెళ్లి చర్చానీయాంశమైంది. ఫేస్‌బుక్ పరిచయంతో ఆ ఇద్దరూ కాస్తా ఒక్కటయ్యారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సుదీప్ అనే యువకుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఆ క్రమంలో సియెరాపులి ప్రాంతానికి చెందిన ప్రతిమ అనే యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ ఫ్రెండ్‌షిప్ కాస్తా బలపడటంతో జులై చివరి వారం నుంచి ఆమెతో ఛాటింగ్ చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో వీరిద్ధరూ ఎన్నోసార్లు వీడియో కాల్స్ కూడా మాట్లాడుకున్నారు.

45 రోజుల పరిచయం.. కలిసిన నాలుగు గంటల్లో వివాహబంధం

45 రోజుల పరిచయం.. కలిసిన నాలుగు గంటల్లో వివాహబంధం

పరిచయమైన 45 రోజుల్లోనే నేరుగా కలుద్దామని డిసైడయ్యారు. తమ ఫ్రెండ్‌షిప్‌ను మరింత బలపరుచుకుందామని డిసైడయ్యారు. ఆ క్రమంలో దసరా పండుగను ఎంచుకున్నారు. అనుకున్నట్లుగానే వీరిద్దరూ హుగ్లీ నది ఒడ్డున కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మనసు విప్పి మాట్లాడుకున్న నాలుగు గంటల్లోనే పెళ్లికి సిద్ధమై పోయారు. 45 రోజుల ఫ్రెండ్‌షిప్‌ కాస్తా కేవలం నాలుగు గంటల్లోగా పెళ్లికి దారి తీసింది. విజయదశమి పండుగ నాడే దుర్గామాత ఆశీస్సులతో వివాహం చేసుకున్నారు.

దసరా పండుగ నాడు దుర్గామాత ఆశీస్సులతో

దసరా పండుగ నాడు దుర్గామాత ఆశీస్సులతో

ఈ నెల అక్టోబర్ 8వ తేదీన దసరా పండుగ నాడు హుగ్లీ నది ఒడ్డున జరిగిన విజయదశమి వేడుకలకు సుదీప్ హాజరయ్యాడు. అయితే అక్కడికి కొద్ది దూరంలో ఉన్న మరో ప్రాంతానికి తన ఫ్రెండ్ ప్రతిమ వచ్చిందని ఛాటింగ్ ద్వారా తెలుసుకున్న సుదీప్ ఒకసారి మనం కలుద్దామని కోరాడు. సుదీప్ ప్రతిపాదనకు ఓకే చెప్పింది ప్రతిమ. ఆ క్రమంలో వారిద్దరూ కలుసుకున్నారు. 45 రోజులుగా ఛాటింగ్ మాత్రమే చేసిన సుదీప్.. ఆమెను చూడగానే భావోద్వేగానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఆమెను కలిసిన నాలుగు గంటల్లో అన్నీ విషయాలు మాట్లాడుకుని పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు.

ఒకరికొకరు నచ్చి.. ఇరువురు మెచ్చి

ఒకరికొకరు నచ్చి.. ఇరువురు మెచ్చి

సుదీప్ గురించి 45 రోజుల్లో పూర్తిగా తెలుసుకుని అతడిని అర్థం చేసుకున్న ప్రతిమ ఆ ప్రపొజల్‌కు ఓకే చెప్పింది. మోకాళ్లపై కూర్చుని నీకు జీవితాంతం తోడుంటానంటూ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన సుదీప్ అమాయకత్వం ఆమెను మంత్రముగ్ధురాలిని చేసింది. ఈ ఇద్దరి వెంట వచ్చిన స్నేహితులు కూడా సై అనడంతో ఇరువురు పూలదండలు మార్చుకుని పెళ్లి తంతు ముగించారు.

ఈ పెళ్లి గురించి సుదీప్ మాట్లాడుతూ ప్రతిమతో తాను ఎప్పుడు ప్రేమలో పడ్డానో తెలియదు కానీ.. ఆమెను మాత్రం నా భార్యగా స్వీకరించాలని అనుకున్నాను. అందుకే ముహుర్తాల గురించి పెద్దగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు. ఇక నవ వధువు ప్రతిమ మాట్లాడుతూ.. ఆయనలోని అమాయకత్వం, దయాగుణం తనను ఆకర్షించాయని.. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి కాదనలేక పోయానని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+