Facebook: అమ్మాయిలు, ఆంటీలతో ఫుట్ బాల్ ఆడుకున్నాడు,టార్గెట్ లేడీస్, క్లైమాక్స్ లో భర్తలు ఎంట్రీ !
చెన్నై/కన్యాకుమారి: పగలు పని చేస్తున్న యువకుడు సాయంత్రం నుంచి అర్దరాత్రి వరకు సోషల్ మీడియాలో కాలం గడుపుతున్నాడు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న అతను ఫేస్ బుక్ లో అనేక మంది మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నాడు. స్నేహం చెయ్యడానికి ఆసక్తి చూపించకుండా నిర్లక్షం చేస్తున్న అమ్మాయిలు, ఆంటీలను టార్గెట్ చేసుకుంటున్న ఆ యువకుడు వారి మీద కక్ష పెంచుకున్నాడు. తరువాత సోషల్ మీడియాలో అమ్మాయిలు, ఆంటీల ఫోటోలు డౌన్ లోడ్ చేసుకుంటున్న ఆ యువకుడు తరువాత వాటిని మార్ఫింగ్ చేసి అశ్లీలంగా చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. రెండు రాష్ట్రాలకు చెందిన అనేక మంది మహిళల జీవితాలతో ఈ కిరాకతుడు ఫుల్ బాల్ ఆడుకున్నాడు. సోషల్ మీడియాలో అశ్లీల ఫోటోలు చేసిన మహిళ కుటుంబ సభ్యులు వారిని నిలదీశారు. ఏం చెయ్యాలో తెలీక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. సోసల్ మీడియా మీద పట్టు సంపాధించిన ఓ ఎలక్ట్రీషియన్ ఇలాంటి పని చేశాడని గుర్తించారు. విషయం తెలుసుకున్న మహిళలు తాము ఇంతకు ముందు స్నేహం చెయ్యడానికి నిరాకరించిన ఆ యువకుడే ఇలాంటి పని చేశాడని తెలుసుకుని హడలిపోయారు.

ఎలక్ట్రీషియన్ కు ఫేస్ బుక్ పిచ్చి
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోవిల్ సమీపంలోని కంచంపురం తాటిచెట్టు ప్రాంతంలో (కేరళ సరిహద్దు)లో సురేష్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ఎలక్ట్రీషియన్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పగలు పని చేస్తున్న సురేష్ సాయంత్రం నుంచి అర్దరాత్రి వరకు సోషల్ మీడియాలో, ఫేస్ బుక్ లో కాలం గడుపుతున్నాడు.

అందమైన అమ్మాయిల కోసం వేట
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న సురేష్ ఫేస్ బుక్ లో అనేక మంది మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నాడు. అందమైన అమ్మాయిలు, వివాహిత మహిళలను పరిచం చేసుకోవాలని సురేష్ అనేక ప్రయత్నాలు చేశాడు. స్నేహం చెయ్యడానికి ఆసక్తి చూపించకుండా నిర్లక్షం చేస్తున్న అమ్మాయిలు, ఆంటీలను టార్గెట్ చేసుకుంటున్న సురేష్ వారి మీద కక్ష పెంచుకున్నాడు.

అమ్మాయిల ఫోటోలు పెట్టి స్నేహం చేసుకున్నాడు
తనకు ఎవరైతే లొంగకుండా కాలం గడిపేస్తున్నారో అలాంటి అమ్మాయిలు, వివాహిత మహిళ ఫేస్ బుక్ అకౌంట్ల నుంచి వారి ఫోటోలను సురేష్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. కొందరు అమ్మాయిల ఫోటోలతో ఫేస్ బుక్ నకిలీ అకౌంట్ లు ప్రారంభించిన సురేష్ తాను అమ్మాయిని అని మహిళలను నమ్మించాడు. తరువాత వారికి ఫ్రెండ్ రిక్వెస్టు పంపించిన సురేష్ అమ్మాయి ముసుగులో వారితో స్నేహం చేసుకున్నాడు.

ఫుట్ బాల్ ఆడుకున్న కామాంధుడు
కొందరు అమ్మాయిలు, ఆంటీలకు కొంతకాలం మెసేజ్ లు చేసిన సురేష్ వారి ఫోన్ నెంబర్లు సంపాధించాడు. ఎప్పుడంటే అప్పుడు వారికి ఫోన్లు చేస్తున్న సురేష్ వారితో అసభ్యంగా మాట్లాడి వారికి నరకం చూపించాడు. చాలా మంది అమ్మాయిలు, యువతులు సురేష్ నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లను బ్లాక్ చేశారు. తరువాత అమ్మాయిలు, ఆంటీల మీద సురేష్ పగ పెంచుకున్నాడు.

అశ్లీల ఫోటోలుగా మార్ఫింగ్ చేసి అప్ లోడ్ చేశాడు
సోషల్ మీడియాలో అమ్మాయిలు, ఆంటీల ఫోటోలు డౌన్ లోడ్ చేసుకుంటున్న సురేష్ తరువాత వాటిని మార్ఫింగ్ చేసి అశ్లీలంగా చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. తమిళనాడుతో పాటు కేరళకు చెందిన అనేక మంది మహిళలు, అమ్మాయిల జీవితాలతో సురేష్ ఆడుకున్నాడు. రోజురోజుకు సురేష్ ఆగడాలు ఎక్కువ అయిపోయాయి.
Recommended Video

కామాంధుడు అరెస్టు
సోషల్ మీడియాలో సురేష్ మార్ఫింగ్ చేసి అప్ లోడ్ చేసిన అశ్లీల ఫోటోలు చేసిన మహిళల కుటుంబ సభ్యులు వారిని నిలదీశారు. ఏం చెయ్యాలో తెలీక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కన్యాకుమారి సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. సోసల్ మీడియా మీద పట్టు సంపాధించిన ఎలక్ట్రీషియన్ సురేష్ ఇలాంటి పని చేశాడని గుర్తించి అతన్ని అరెస్టు చేసి రెండు సిమ్ కార్డులు స్వాధీనం చేసున్నారు. సురేష్ విషయం తెలుసుకున్న మహిళలు తాము ఇంతకు ముందు స్నేహం చెయ్యడానికి నిరాకరించిన ఆ యువకుడే ఇలాంటి పని చేశాడని తెలుసుకుని హడలిపోయారు.












Click it and Unblock the Notifications