నకిలి టెక్కీ: ఫేస్ బుక్ లవ్, పెళ్లికి నో చెప్పిన యువతి ఇంటికెళ్లి చీల్చేశాడు, ఆమె చెల్లిని !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: నేను సాఫ్ట్ వేర్ ఇంజనీరు అంటూ యువతితో పరిచయం పెంచుకున్న యువకుడు చివరికి ఆమెను వలలో వేసుకున్నాడు. తీరా అతను సాఫ్ట్ వేర్ ఇంజనీరు కాదని తెలుసుకున్న యువతి అతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది.

కుమార్తెను కుర్చీలో కట్టేసి పక్కింటి ఆంటీని రేప్ చేశాడు, చివరికి కామాంధుడు !

సహనం కోల్పోయిన యువకుడు ఆమె గొంతు కోసేసి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. యువతి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. సోదరిని రక్షించడానికి ప్రయత్నించిన మరో యువతికి తీవ్రగాయాలైనాయి. చెన్నైలోని రాయపురంలో నివాసం ఉంటున్న నకిలీ ఇంజనీరు షఫివుల్లా (28) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

10 తరగతి కూడా !

10 తరగతి కూడా !

రాయపురంలో నివాసం ఉంటున్న షఫీవుల్లా 10 తరగతి పాస్ కాకుండ మద్యలోనే చదువుకు నామం పెట్టాడు. అయితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సోషల్ మీడియాలో ఎంత ఫాస్ట్ గా ఉంటారో అంతకంటే ఫాస్టుగా ఇతను ఉంటాడు. నిత్యం సోషల్ మీడియాలో చాల మందితో టచ్ లో ఉంటున్నాడు.

ఫేస్ బుక్ లో యువతికి గాలం !

ఫేస్ బుక్ లో యువతికి గాలం !

చెన్నైలోని రాయపేట్ లోని మహమ్మద్ ఖాసీం వీదిలో నివాసం ఉంటున్న 24 ఏళ్ల యువతి ఎంఏ పూర్తి చేసింది. ఒక సంవత్సరం క్రితం షఫీవుల్లా యువతితో ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకున్నాడు. తాను సాఫ్ట్ వేర్ ఇంజనీరు అంటూ ఆమెను నమ్మించాడు. నిత్యం సోషల్ మీడియాలో ఆమెతో టచ్ లో ఉన్నాడు.

వలలో పడేశాడు

వలలో పడేశాడు

షఫీవుల్లా యువతికి స్నేహితుడిగా దగ్గర అయ్యాడు. తరువాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. యువతిని వలలో వేసుకున్న షఫీవుల్లా పెళ్లి చేసుకుందామని ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే షఫీవుల్లా తీరుపై ఆమెకు అనుమానం వచ్చింది.

విషయం తెలిసి హ్యాండ్ !

విషయం తెలిసి హ్యాండ్ !

షఫీవుల్లా 10 తరగతి పూర్తి చెయ్యలేదని ఆ యువతికి అసలు విషయం తెలిసింది. తరువాత అతన్నిపెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ఆ యువతి షఫీవుల్లాకు దూరంగా ఉంటోంది. ఆమె దూరం కావడంతో ఆ విషయాన్ని షఫీవుల్లా జీర్ణించుకోలేకపోయాడు.

ఇంటిలో చోరబడి !

ఇంటిలో చోరబడి !

ఆదివారం యువతి ఇంటిలో ఉందని తెలుసుకున్న షఫీవుల్లా నేరుగా రాయపేట్ లోని మహమ్మద్ ఖాసీం వీదిలోకి వెళ్లాడు. తరువాత యువతి ఇంటిలో చోరబడి తనను పెళ్లి చేసుకోవాలని ఆమె మీద ఒత్తడి చేశాడు. పెళ్లి చేసుకోవడానికి ఆమె నిరాకరించింది.

పక్కా ప్లాన్ తో చిల్చేశాడు !

పక్కా ప్లాన్ తో చిల్చేశాడు !

పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోవడంతో సహనం కోల్పోయిన షఫీవుల్లా ముందుగా జోబులో పెట్టుకుని తీసుకెళ్లిన కత్తి తీసుకుని మాజీ ప్రియురాలిపై దాడి చేశాడు. కిందపడిన ఆమె గొంతు చీల్చేశాడు. సోదరిని రక్షించడానికి ప్రయత్నించిన ఆమె సోదరి మీద కత్తితో దాడి చేశాడు.

కేకలు వేశారు, స్థానికులు !

కేకలు వేశారు, స్థానికులు !

యువతులు ఇద్దరూ కేకలు వెయ్యడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెనుక దారి నుంచి షఫీవుల్లా పరారైనాడు. ఇద్దరు యువతులను చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరించారు. తప్పించుకుని తిరుగుతున్న షఫీవుల్లాను సోమవారం అరెస్టు చేసిన రాయపేట్ పోలీసులు నకిలి ఇంజనీరు బెండ్ తీస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 28-year-old man, who developed relationship with a 24-year-old woman on Facebook by making a false claim that he was an engineer, slit her throat on Sunday in Chennai.
Please Wait while comments are loading...