శుభవార్త: ఫేస్ బుక్ ఫ్రొఫైల్ పిక్చర్ ను డౌన్ లోడ్ చేయలేరు, కొత్తటూల్ ఇదే!

ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వా సామాజిక మాధ్యమైన ఫేస్ బుక్ ను పురుషులతో పాటు మహిళలు కూడ విరివిగా వాడుతున్నారు.

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వా సామాజిక మాధ్యమైన ఫేస్ బుక్ ను పురుషులతో పాటు మహిళలు కూడ విరివిగా వాడుతున్నారు. ఫేస్ బుక్ లో మహిళల ఫ్రోఫైల్ పిక్చర్ ను ఇతరులు డౌన్ లోడ్ చేసుకోకుండా కొత్త టూల్ ను అందుబాటులోకి తెచ్చింది ఫేస్ బుక్.

ఫేస్ బుక్ లోని ఫోటోలను డౌన్ లోడ్ చేసి మార్పింగ్ చేసి ఎక్కడైనా పోస్ట్ చేస్తారేమోననే భయం ఇప్పటివరకు మహిళల్లో ఉంది.దీంతో కొందరు ఫేస్ బుక్ ఖాతాను నిర్వహిస్తున్నప్పటికీ కూడ ఎఫ్ బీ ఫ్రొఫైల్ లో తమ ఫోటోను పెట్టుకొనేందుకు భయపడుతుంటారు.

Facebook pilots tools to protect Indian women profile photos

ఈ పరిస్థితిని గమనించిన ఫేస్ బుక్ మహిళల కోసం కొత్త టూల్ ను పరిచయం చేసింది. మహిళల ప్రొఫైల్ ఫోటోలను డౌన్ లోడ్ చేసేందుకు వీలు లేకుండా ఈ కొత్త టూల్ ను ప్రవేశపెడుతున్నట్టు సంస్థ ప్రొడక్ట్ మేనేజన్ ఆరతీ సోమన్ వెల్లడించారు.

దీంతో పాటు ఫ్రొఫైల్ పిక్చర్లపై డిజైన్ వేసుకొనే మరో సదుపాయాన్ని కల్పించినట్టు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా భారత్ లో దీన్ని ప్రవేశపెడుతున్న ఫేస్ బుక్...ఇతర దేశాలకు కూడ ఈ సదుపాయాన్ని పరిచయం చేయాలనుకొంటోంది.

ఫేస్ బుక్ ప్రవేశపెట్టిన ఫ్రొపైల్ పిక్చర్ గార్డ్ ను మహిళలు ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా ఇతర వ్యక్తులు వారి ఫ్రోఫైల్ పిక్చర్ ను డౌన్ లోడ్ చేయడం గానీ, షేర్ చేయడం గానీ, ఇతరులకు పంపించడం గానీ కుదరదు.

అంతేకాదు ఫేస్ బుక్ లో స్నేమితులు కాపోతే వారిని ఇతరులకు ట్యాగ్ చేయడం కూడ కుదరదు. ఇక స్క్రీన్ షాట్ తీసే అవకాశం కూడ ఉండదు. ఈ టూల్ ను వినియోగించే వారి ఫ్రొఫైల్ పోటో చుట్టూ నీలరంగు బోర్డర్ కన్పిస్తోంది. దీంతో పాటు అదనపు డిజైన్ లేయర్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా ఫ్రొపైల్ పికర్చర్ ను ఇతరులు కాపీ చేసే అవకాశాలు చాలా తక్కువని ఫేస్ బుక్ ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+