ఫేస్‌బుక్‌తో ఐఎస్ఐఎస్ గాలం: ఉగ్రవాది అక్లాక్
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు ఏ విధంగా వల వేస్తున్నారనే విషయాన్ని అరెస్టు అయిన ఉగ్రవాది మహమ్మద్ అక్లాక్-ఉర్-రెహమాన్ వెల్లడించాడని దర్యాప్తు చేస్తున్న అధికారులు చెప్పారు.
పాలిటెక్నిక్ విద్యాభ్యాసం చేస్తున్న మహమ్మద్ అక్లాక్ -ఉర్-రెహమాన్ (17) పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడని అధికారులు తెలిపారు. అక్లాక్ ఉగ్రవాదులతో ఏ విధంగా సంబంధాలు పెట్టుకున్నాడనే విషయాలు వివరించారు.
అక్లాక్ ఫేస్ బుక్ లో చేసిన ఒకే ఒక పోస్టు అతన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు దగ్గర చేసిందని అధికారులు గుర్తించారు. అతను ఒక ఉద్వేగభరితమైన పోస్టును ఫేస్ బుక్ లో పెట్టి అనేక మందికి దగ్గర అయ్యాడని అధికారులు చెప్పారు.

1992 డిసెంబర్ 6వ తేదిన బాబ్రీ మసీదు కూల్చివేశారని, 22 సంవత్సరాల పూర్తి అయిన తరువాత తాను ఈ ఉద్వోగభరితమైన పోస్టు చేస్తున్నానని అక్లాక్ ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేశాడు. దానికి సోషల్ మీడియాలో వందాలది లైక్స్, హిట్స్ వచ్చాయి.
ఈ పోస్టును ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది యూసఫ్ అని చెప్పుకున్న వ్యక్తి చూశాడు. ఉగ్రవాది ఫేస్ బుక్ లో అక్లాక్ కు ఓ మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్ లో అక్లాక్ తెలివైన, దైర్య సాహసాలు కలిగిన వాడిగా పొగడ్తలతో ముంచెత్తాడు.
అక్లాక్ ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపేలా ప్రేరేపించారని విచారణ చేస్తున్న అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అక్లాక్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో కమాండర్ హోదాలో ఉన్నాడని దర్యాప్తు చేస్తున్న అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ తరపున ఖలీఫా రాజ్య స్థాపన కోసం పోరాడటానికి అక్లాక్ అంగీకరించాడని అధికారులు చెప్పారు. పలు పరిక్షలు నిర్వహించిన తరువాత తనను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేర్చుకున్నారని అక్లాక్ అధికారులకు చెప్పాడు.
అక్లాక్ లాగే మరో నలుగు విద్యార్థులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో సోషల్ మీడియాలో ఉగ్రవాద సంబంధాలు సాగిస్తున్నారని అధికారులు అన్నారు. యువత సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉగ్రవాదుల ఆదేశాల మేరకు అక్లాక్ కుంబమేళలో దాడులు చెయ్యాలని ప్లాన్ లు వేశాడని విచారణలో వెలుగు చూసిందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications