• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నకిలీ ఖాతాలపై ఫేస్ బుక్ నజర్ ,:687 కాంగ్రెస్, 15 బీజేపీ తొలగింపు

|

ఫేక్ ఖాతాలకు,ఫేక్ వార్తలకు ఫేస్ బుక్ బ్రేకులు వేస్తుంది.దీంతో కాంగ్రెస్ ,బీజేపీలకు చెందిన సుమారు 700 ఖాతాలను తోలగించింది. కొద్ది రోజుల క్రితం హెచ్చరించినట్టుగానే పలు ఖాతాలను తొలగించింది.దీంతో అటు కాంగ్రెస్ పార్టీ కి పెద్ద షాక్ ఇవ్వగా ,బీజేపి కి చెందిన 15 నమో ఆప్ పేజీలను కూడ తొలగించింది. పేజీలను తొలగిస్తున్నట్టు ఫేస్ బుక్ సైబర్ సెక్యూరిటి హెడ్ నథానియల్ గ్లిచర్ తెలిపారు

పార్టీలపై ఫేస్‌బుక్ నజర్

పార్టీలపై ఫేస్‌బుక్ నజర్

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలను గందరగోళనానికి గురిచేసేందుకు పలువురు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు.దీంతో ఎదీ నిజమైన వార్తో ఏదీ అబద్దమో తెలియని గందరగోళ పరిస్థితి నెలకోంది.ప్రధానంగా ఎన్నికల నేపథ్యంలో ఫేస్ బుక్ యాజమాన్యం ఇదివరకు ప్రకటించినట్టుగా ఫేస్ బుక్ ను అనుచిత పద్దతుల్లో ఉపయోగించే ఖాతాదారులను తొలగిస్తామని చెప్పింది. ఈమేరకు ఇదివరకే పలుసార్లు హెచ్చరించింది. ఈనేపథ్యంలోనే దేశంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ ,బీజేపీలపై దృష్టి సారించింది.

687 నకీలీ ఖాతాలను తొలగించిన ఫేస్ బుక్

687 నకీలీ ఖాతాలను తొలగించిన ఫేస్ బుక్

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ నే ఇచ్చారు ఫేస్ బుక్ నిర్వాహకులు. కాంగ్రెస్ పార్టీ ఐటి సెల్ తో సంబంధం ఉన్నయని పేర్కోంటూ 687 నకిలీ అకౌంట్ పేజీలను తొలగించింది. కాగా యూజర్లను తప్పుదోవ పట్టించడంతో పాటు ఆయా అకౌంట్ల ప్రవర్తన ఆధారంగా తొలగిస్తున్నట్టు ఫేస్ బుక్ సైబర్ సెక్యూరిటి హెడ్ నథానియల్ గ్లిచర్ తెలిపారు. కాగా తోలగించిన ఖాతాలన్ని కాంగ్రెస్ పార్టీ ఐటి సెల్ లో పనిచేసే వారి వ్యక్తిగత అకౌంట్లతో సంబంధం ఉన్న పేజీలను తొలగిస్తున్నట్టు ఆయన తెలిపారు. అయితే తొలగించిన ఖాతాలు వారు పోస్ట్ చేసిన కథనాలకు కాదని తెలిపింది.

ఎఫ్‌బీ పేజీల తొలగింపుపై స్పందించిన కాంగ్రెస్

ఎఫ్‌బీ పేజీల తొలగింపుపై స్పందించిన కాంగ్రెస్

ఫేస్‌బుక్ నకిలీ ఖాతాలు తొలగించడంపై కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫేస్‌బుక్ అధికారిక పేజీలను తొలగించలేదని ,పార్టీకి చెందిన ఫేస్‌బుక్ పేజీలన్నీ అధికారికంగా ధ్రువికరించినవేని పేర్కోన్నారు,కాగా ఈ విషయంలో మేం ఫేస్‌బుక్ స్పందన కోసం ఎదురు చూస్తున్నమని తెలిపారు. ఫేస్‌బుక్ తోలగించామని చెబుతున్న ఖాతాల సంబంధించి వివరాలను అందించాల్సిందిగా ఆ సంస్థను కోరామని తెలిపింది. కాగా యూనియన్ ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ తోలగించిన ఖాతాలు కాంగ్రెస్ పార్టీ ఐటి సెల్ కు చెందిన నకీలి ఖాతాలని వాటికి సంబంధించి సరైన అడ్రస్ ప్రూఫ్ లేదని తెలిపారు.కాగా కాంగ్రెస్ పార్టీ ఫేక్ ఖాతాల ద్వార ప్రధాని నరేంద్ర మోడి కి వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారని అన్నారు.

బీజేపీ కి సంబంధమున్న 15 ఖాతాల తోలగింపు

బీజేపీ కి సంబంధమున్న 15 ఖాతాల తోలగింపు

కాంగ్రెస్ పార్టీ ఖాతాలను తొలగించిన కొద్ది గంటల్లోనే బీజేపి కి సంబంధమున్న ఇండియాలోని నమో ఆప్ కు చెందిన ఐటి కంపనీ సిల్వర్ టచ్ కు చెందిన 15 ఖాతాలను కూడ తొలగించనట్టు ఫేస్ ప్రకటించింది.అయితే వీటిపై బీజేపి నుండి ఎలాంటీ స్పందనా రాలేదు.

 ఫలించిన కేంద్రప్రభుత్వ ప్రయత్నాలు

ఫలించిన కేంద్రప్రభుత్వ ప్రయత్నాలు

గత కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ పార్లమెంటరీ కమిటి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే సోషల్ మీడీయా సంస్థల ప్రతినిధులతో పలు సార్లు సమావేశం ఏర్పాటు చేశారు. తప్పుడు వార్తలతోపాటు పలువురిని వ్యక్తిగతంగా నిందిస్తూ పోస్టులు పెట్టడం వంటి వాటిని ఎలా కంట్రోల్ చేస్తారో జవాబు చెప్పాలని కోరింది.దీంతో ఫేస్ బుక్,వాట్సప్ ,ట్విట్టర్ లాంటీ సోషల్ మీడియా సంస్థలు హజరయ్యాయి.ఈ సమావేశాల నేపథ్యంలోనే ఫేస్ బుక్ చర్యలు చేపట్టింది.వాటి ఫలితమే ఆటు కాంగ్రెస్ కు చెందిన మెజారీటి ఫేక్ పేజీలను తోలగించినట్టు తెలిపింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a startling revelation ahead of general elections, Facebook announced it has removed 687 spam Facebook Pages and accounts connected to individuals associated with the Congress Party's IT cell, and it has removed 15 pages and accounts linked to individuals related to an Indian IT firm named Silver Touch, a company associated with Prime Minister Narendra Modi’s NaMo app also
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more