ఫేస్‌బుక్‌లో కనిపించని రైతు ఉద్యమ పేజీ, ఆందోళన.. తర్వాత రీ స్టోర్.. ఎందుకంటే..
వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. చట్టానికి సవరణలు చేయాలని.. లేదంటే రద్దు చేయాలని కోరుతున్నారు. తమ నిరసనను సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పేజీ క్రియేట్ చేసి.. లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇచ్చారు. అయితే అదీ నిన్న సాయంత్రం కాసేపు కనిపించలేదు. దీంతో ఏం జరిగిందనే చర్చ జరిగింది. కిసాన్ మోర్చా ప్రతినిధులు కూడా కన్నేశారు. తర్వాత ఏం జరిగిందో ఫేస్‌బుక్ వివరణ ఇచ్చింది.

94 లక్షల మంది ప్రజలు
రైతు సమస్యలపై ఫేస్‌బుక్‌లో ఓ పేజీని కిసాన్ సంయుక్త్ మోర్చాకు చెందిన ఐటీ విభాగం ఏర్పాటు చేసింది. ఆ పేజీకి యూజర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 94 లక్షల మందికి రీచ్ కూడా అయ్యింది. ఆదివారం సాయంత్రం లైవ్ స్ట్రీమ్ కూడా జరుగుతోంది. ఇంతలో పేజీ కనిపించలేదు. దీంతో సంయుక్త్ కిసాన్ మోర్చా ఆందోళనకు గురయ్యింది. అయితే కాసేపటి ఫేస్ బుక్‌లో పేజీ కనిపించింది.

కనిపించని పేజీ..
పేజీ కనిపించడంతో ఊరట కనిపించినా.. ఎందుకు తొలగించారని నెటిజన్లు ప్రశ్నించారు. పేజీని కనిపించకుండా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. జరిగిన అంతరాయానికి చింతిస్తున్నామని ఫేస్‌బుక్ యాజమాన్యం తెలిపింది. అయితే ఎందుకు స్తంభించి పోయిందో మాత్రం తెలియజేయలేదు. కానీ ఎఫ్‌బీపై మాత్రం రైతులకు అనుకూలంగా ఉండేవారు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు. అసలేం జరుగుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు.

అహోరాత్రులు వాలంటీర్ల శ్రమ..
25 మంది ఆన్ లైన్, 35 మంది ఆఫ్ లైన్ వాలంటీర్ల నిరంతరాయంగా పనిచేస్తున్నారు. 24/7 వారు కష్టపడి ఆన్ లైన్ డిస్కషన్స్, రైతుల నిరసనలపై తప్పుడు పోస్టులను ప్రజలకు తెలియజేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, స్నాప్‌చాట్, యూ ట్యూబ్‌లలో వాస్తవ సమాచారం అందజేస్తున్నారు. ఇవీ ప్రతీరోజు లక్షలాది మంది ప్రజలకు చేరుతోంది. ఇందులో పనిచేస్తోన్న చాలా మంది వాలంటీర్లు పంజాబ్, ఢిల్లీ నుంచి ఉన్నారు. చాలా మంది వర్క్ ఫ్రం హోం చేస్తూ.. సమస్యను ప్రజలకు తెలియజేస్తున్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications