Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

facebook: ఫేస్ బుక్ లో ఫిగర్ ఫోటో చూసి సోల్లు కార్చుకుని ఏం చేశాడంటే ?, పాకిస్తాన్ ఐఎస్ఐతో డీల్ !

అహమ్మదాబాద్/సూరత్: భారత సైన్యం రహస్యాలు తెలుసుకోవాలని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ సంస్థ (ఐఎస్ఐ) అనేక ప్రయత్నాలు చేస్తోంది. భారత సైన్యం రహస్యాలు తెలుసుకోవడానికి ఐఎస్ఐ సంస్థ సోషల్ మీడియాలో అమ్మాయిల ఫోటోలు అడ్డం పెట్టుకుని బ్రోకర్ పని చేస్తూ కాలం గడుపుతోంది. ఫేస్ బుక్ లో అందమైన అమ్మాయి ఫోటో చూసి నిజంగా ఆమె ఆడది అని మోసపోయిన వ్యక్తి ఆమె మోజులో పడిపోయాడు. తరువాత పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐతో లింక్ పెట్టుకుని భారత సైన్యం రహస్యాలు పాకిస్తాన్ కు అందిస్తున్న వ్యక్తి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు.

ఫేస్ బుక్ లో అందమైన అమ్మాయి ఫోటో

ఫేస్ బుక్ లో అందమైన అమ్మాయి ఫోటో

అందమైన అమ్మాయి ఫోటో చూసి సోల్లు కార్చుకున్న భారతీయుడు భారత సైన్యం రహస్యాలు తెలుసుకుంటూ పాకిస్తాన్ లోని ఐఎస్ఐ సంస్థకు సమాచారం ఇస్తూ అడ్డంగా బుక్కైపోయాడు. పాకిస్తన్ లోని ఐఎస్ఐతో పాటు ఆ సంస్థతో లింక్ పెట్టుకున్న వారి మీద భారత్ ఇంటిలిజెన్స్ అధికారులు నిఘా వేసి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు.

బూతులతో చాటింగ్.... సోల్లు కార్చుకున్నాడు

బూతులతో చాటింగ్.... సోల్లు కార్చుకున్నాడు

రాజస్థాన్ లోని సూరత్ లో దీపక్ సాళుంకే అలియాస్ దీపక్ అనే వ్యక్తి సొంతంగా అంగడి పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలం క్రితం ఫేస్ బుక్ లో ఓ యువతి దీపక్ కు పరిచయం అయ్యింది. కొంతకాలం పాటు ఫేస్ బుక్ గర్ల్ ఫ్రెండ్ తో దీపక్ బూతులతో చాటింగ్ చేస్తూ శునకానందం పొందాడు. యువతిని తనకు పడిపోయిందని దీపక్ ఎగిరిగంతేశాడు.

మేడమ్ కాదు... సార్ అని తెలుసుకుని ?

మేడమ్ కాదు... సార్ అని తెలుసుకుని ?

తరువాత ఫేస్ బుక్ లో పరిచయం అయిన యువతి నుంచి ఓ మెసేజ్ వచ్చింది. తన పేరు హమీద్ అని దీపక్ ను పరిచయం చేసుకున్నాడు. పాకిస్తాన్ లోని ఐఎస్ఐ ఏజెంట్ అయిన హమీద్ దీపక్ కు మాయమాటలు చెప్పి భారత సైన్యం రహస్యాలు అందించాలని అతనికి బ్రైన్ వాష్ చేశాడు.

డబ్బులు కూడా పంపించిన ఐఎస్ఐ

డబ్బులు కూడా పంపించిన ఐఎస్ఐ

దీపక్ అకౌంట్ కు ఐఎస్ఐ ఏజెంట్లు రూ. 75, 856 నగదు పంపించారు. భారత సైన్యం గురించి సమాచారం సేకరిస్తున్న దీపక్ వాట్సాప్ ద్వారా పాకిస్తాన్ లోని ఐఎస్ఐ ఏజెంట్ హమీద్ కు పంపించడం మొదలుపెట్టాడు. దీపక్ వ్యవహారం తెలుసుకున్న సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. గతంలో కూడా ఫేస్ బుక్ లో అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టిన ఐఎస్ఐ ఏజెంట్ లు కొందరు భారతీయులను వలలో వేసుకుని భారత సైన్యం రహస్యాలు తెలుసుకోవాలని ప్రయత్నించిన వియషం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+