Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఎంపీ నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు, సీడీ కూడ ఉంది: మహిళ ఆరోపణ

గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ ఎంపిని బ్లాక్ మెయిల్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ సంచలన ఆరోపణలు చేశారు.ఆ ఎంపి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ప్రకటించారు.

న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ ఎంపిని బ్లాక్ మెయిల్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ సంచలన ఆరోపణలు చేశారు.ఆ ఎంపి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ప్రకటించారు. ఈ మేరకు తనవద్ద సీడీ ఉందని ఆమె ప్రకటించారు.

అయితే తనను మాయలేడి ట్రాప్ చేసిందని ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను అభ్యంతరకరంగా ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతోందని ఆ మహిళపై ఎంపీ న్యూఢిల్లీ పోలీసులకు పిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ మహిళ ఇంటిని గుర్తించారు. ఆ ఇంటిపై దాడి చేశారు.అయితే ఆమె అప్పటికే ఆ ఇంటి నుండి పారిపోయింది. నెల రోజుల క్రితం హర్యానా రాష్ట్రానికి చెందిన ఎంపీపై అత్యాచార ఆరోపణలు చేస్తూ ఆ మాయాలేడీ కేసు పెట్టింది.

Facing rape charge, BJP MP claims he was honey-trapped

అయితే ఈ కేసును ఆమె తర్వాత ఉపసంహరించుకొందని ఢిల్లీ ప్రత్యేక పోలీస్ కమిషనర్ ముఖేష్ మీనా చెప్పారు. ఈ కేసును ఎందుకు ఆమె ఉపసంహరించుకొందో కూడ దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఆ మాయాలేడీ బ్లాక్ మెయిల్ కేసు అని అయితే గుజరాత్ కు చెందిన ఎంపీపై అత్యాచారం కేసు నమోదు చేయలేదని కమిషనర్ వివరించారు. పోలీసులు కిలాడీ లేడీ ఫోన్ కాల్స్ పై నిఘా ఏర్పాటు చేసి ఆమె వివరాలను రాబట్టే పనిలో పడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+