బ్యాంకర్: బదిలీ కోరుతున్న ఫడ్నవీస్ భార్య (ఫొటోలు)

నాగపూర్‌: ఇదే తొలి సంఘటన కావచ్చు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న దేవేంద్ర ఫఢ్నవీస్ భార్య బ్యాంక్‌ ఉద్యోగిని. ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ఆక్సిస్ బ్యాంక్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆమె నాగపూర్ శాఖలో ప్రస్తుతం పనిచేస్తున్నారు.

బదిలీ మీద ముంబైకి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఆమె టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం జరగలేదని, తర్వాత నిర్ణయం తీసుకుంటామని, తన కూతురు ప్రస్తుతం ఇక్కడ చదువుతోందని, తాను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నానని ఆమె అన్నారు.

దేవేంద్ర ఫడ్నవిస్

దేవేంద్ర ఫడ్నవిస్

మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దాంతో, ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఆయనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజా ఎన్నికల్లో 122 స్థానాలు గెలుచుకున్న బీజేపీకి, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయిన మద్దతును శివసేన ఇవ్వనుంది.

 అమృత ఫడ్నవీస్

అమృత ఫడ్నవీస్


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాగపూర్ నియోజక వర్గం నుండి విజయం సాధించిన దేవేంద్ర ఫడ్నవిస్ స్వీట్స్ తినిపిస్తున్న ఆయన భార్య అమృత ఫడ్నవీస్.

 అమృత ఫడ్నవీస్

అమృత ఫడ్నవీస్


మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న అనంతరం ఆయన భార్య అమృత ఫడ్నవీస్, కుమార్తె దివిజ విజయ సంకేతం చూపిస్తున్న దృశ్యం.

అప్యాయంగా కుమారున్ని అలింగనం చేసుకున్న సరిత

అప్యాయంగా కుమారున్ని అలింగనం చేసుకున్న సరిత


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాగపూర్ నియోజక వర్గం నుండి విజయం సాధించిన దేవేంద్ర ఫడ్నవిస్ అప్యాయంగా అలింగనం చేసుకున్న ఆయన తల్లి సరిత. ప్రక్కనే భార్య అమృత ఫడ్నవీస్.

 దేవేంద్ర ఫఢ్నవీస్ తల్లి సరిత

దేవేంద్ర ఫఢ్నవీస్ తల్లి సరిత

తన కుమారుని మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న విషయాన్ని టీవిలో చూస్తున్న దేవేంద్ర ఫఢ్నవీస్ తల్లి సరిత.

ఫడ్నవీస్ దంపతులకు ఐదేళ్ల కూతురు దివిజ ఉంది. దేవేంద్ర ప్రసాద్ ముఖ్యమంత్రి కాబోతున్నట్లు సమాచారం అందిన వెంటనే అమృత కూతురితో పాటు ముంబై బయలుదేరి వెళ్లారు. టెలివిజన్‌లో కుటుంబ సభ్యులు ప్రకటన చూశారు. విమానంలోనే ఆమెకు అభినందనలు చెప్పడం ప్రారంభమైంది.

దివిజ ప్రస్తుతం నాగపూర్‌లోని టాప్ స్కూల్లో సీనియర్ కెజి చదువుతోంది. ఆమెను ముంబై స్కూల్లో చేర్పించడంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అమృత ముంబై చేరుకున్న తర్వాత అన్నారు. ఫడ్నవీస్ తల్లి సరిత కూడా ముంబైకి మారే ఆలోచనలో ఉన్నారు. తన మనవరాలు దివిజ కోసం తాను ముంబై మారాలనుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+