మీ రోగం నయం చేస్తా: నకిలి బాబా మాయ, 7 లక్షల నగదు, బంగారం లూటీ, బెంగళూరు !

రోగం నయం చేస్తానని ఇంటికి వెళ్లిన నకిలి బాబాపూజలు చేసినట్లు నటించి మత్తుమందు కలిపిన ప్రసాదం ఇచ్చాడుమత్తులోకి వెళ్లిన దంపతులు, 7 లక్షల నగదు, బంగారం లూటీ, బాబాకు పండగే పండగ !

బెంగళూరు: మీ రోగం నయం చేస్తానని ఇంటికి వెళ్లిన నకిలి బాబా గుట్టుచప్పుడు కాకుండా ఇల్లు లూటీ చేసిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని కిత్తగానహళ్ళిలో జరిగింది. 7 లక్షల నగదు, బంగారంతో బాబా మాయం అయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నకిలి బాబా కోసం గాలిస్తున్నారు.

బెంగళూరు గ్రామీణ జిల్లా ఆనేకల్ తాలుకాలోని కిత్తగానహళ్ళి ప్రాంతంలో క్రిష్ణమూర్తి, లక్ష్మిదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. క్రిష్ణమూర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. క్రిష్ణమూర్తి భార్య లక్ష్మిదేవి చాలకాలంగా మూర్చ వ్యాదితో బాధపడుతున్నారు.

Fake Baba escaped from house with Rs 7 lakh in Anekal near Bengaluru

విషయం తెలుసుకున్న నకిలి బాబా లక్ష్మిదేవి వ్యాదిని నయం చేస్తానని ఆమె భర్త క్రిష్ణమూర్తిని నమ్మించాడు. బుధవారం క్రిష్ణమూర్తి ఇంటికి నకిలి బాబా వెళ్లాడు. పూజలు చేసినట్లు నకిలి బాబా నటించాడు. తరువాత ప్రసాదం తినాలని ముందుగా మత్తుమందు కలిపిన పదార్థాలను దంపతులకు ఇచ్చాడు. ప్రసాదం తిన్న క్రిష్ణమూర్తి, లక్ష్మిదేవి దంపతులు మత్తులోకి జారుకున్నారు. అంతే నకిలి బాబా ఇల్లు మొత్తం గాలించాడు

చేతికి చిక్కిన బంగారు నగలు, వెండి వస్తులు, 7 లక్షల రూపాయల నగదు లూటీ చేసి పారిపోయాడు. సాయంత్రం మత్తు దిగడంతో క్రిష్ణమూర్తి, లక్ష్మిదేవి దంపతులు లేచారు. ఇంటిలో బాబా కనపడకపోవడంతో అనుమానం వచ్చి ఇంటిలో పరిశీలించగా అసలు విషయం తెలిసింది. సూర్యా సిటి పోలీసులు కేసు నమోదు చేసి నకిలి బాబా కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+