గడ్డం పెట్టి, ఐడీ కార్డు చూపించి రైడ్ .. పట్టించిన స్వరం, ముజఫర్‌నగర్‌లో ఫేక్ సీబీఐ లీలలు
ముజఫర్ నగర్ : దురాలోచన .. ఆశతో అన్నంపెట్టిన ఇంటికే కన్నం వేస్తారు కొందరు కేటుగాళ్లు. ఆ ఇంటి యాజమానులు చేసిన తప్పేంటీ అంటే పనొళ్లను పూర్తిగా నమ్మడమే. ఇక అసలే సినిమాల్లో మన హీరోలు నకిలీ అధికారుల అవతారం ఎత్తూతూనే ఉన్నారు. దీనినే ఆదర్శంగా తీసుకొన్నాడు ఓ కేటుగాడు.

నమ్మితే ..
అన్నం పెట్టిన ఇంటికి సున్నం పెట్టారు అనే సామెతర ఊరికే రాలేదు. తమ బంటు అని నమ్మడమే ఓనర్లు చేస్తున్న తప్పవుతుంది. తాజాగా యూపీలో ఓ వ్యక్తి చేసిన హంగామా .. అతనిని కటకటాలపాలు చేసింది. ముజఫర్ నగర్‌లో ఆదేశ్ గోయెల్ అనే వ్యక్తి రైస్ మిల్ నడుపుకుంటు ఉన్నాడు. ఇతని వద్ద త్రివిందర్ అనే వ్యక్తి పనికి కుదిరాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నాడు .. తర్వాత మాయమైపోయాడు. ఏం జరిగిందో ఏమో అని పట్టించుకోలేదు ఆదేశ్. అదే అతను చేసిన తప్పయ్యింది.

ఫ్రం సీబీఐ ...
శనివారం గోయల్ ఇంటికి ఓ సీబీఐ అధికారి, ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు. నకిలీ కార్డు చూపించి .. తనిఖీల పేరుతో హంగామా చేశారు. అయితే తనను ఎక్కడ గుర్తుపడతారేమోనని త్రివిందర్ .. గడ్డం పెట్టుకొని వచ్చాడు. రైస్ మిల్‌కు సంబంధించి పలు ప్రశ్నలు వేశాడు. అయితే సీబీఐ అధికారి తీరుపై స్థానికులకు అనుమానం కలిగింది. డాక్యుమెంట్స్ చూపాలని గొడవ చేయడంతో .. ఆ వీధిల్లో ఉంటున్న వారికి అనుమానం కలిగింది. సీబీఐ అధికారి ఇలా ప్రవర్తించడమేంటని అనుకొన్నారు. పైకి చూస్తే గడ్డం ఉంది .. కానీ భాష మాత్రం మారలేదు. దీంతో అతను త్రివిందర్ అని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఒకింత షాక్‌నకు గురయ్యారు. నకిలీ సీబీఐ అధికారి అని కలరింగ్ ఇచ్చిన త్రివిందర్‌పై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ యోగేంద్ర సింగ్ పేర్కొన్నారు.

కనిపెట్టని పోలీసులు ....
శనివారం ముజఫర్ నగర్ పోలీసు స్టేషన్‌కు ఓ వ్యక్తి వచ్చాడు. తాను సీబీఐ అధికారినని నమ్మబలికాడు. ఐడీ కార్డు చూపించడంతో వారు నిజమేనని అనుకొన్నారు. వెంటనే అతనితో ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా పంపించారు. కానీ ఆదేశ్ ఇంట్లో ప్రవర్తన .. స్థానికుల అనుమానంతో త్రివిందర్ బండారం బట్టబయలైంది. తమనే మోసం చేస్తావా అని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications