Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రిజర్వ్ బ్యాంకులోకి రూ 25 లక్షల నకిలీ నోట్లతో ఎంట్రీ, కట్ చేస్తే !!

బెంగళూరు నగరంలో నకిలీ నోట్లను ఏకంగా రిజర్వు బ్యాంకుకు తీసుకెళ్లే అక్కడ మార్చడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నాను. కేరళలో దొంగ నోట్లు ముద్రించి వాటిని బెంగళూరు తీసుకొచ్చి ఆ నకిలీ నోట్లు మార్చడానికి ప్రయత్నించారు. అఫ్జల్ అనే వ్యక్తి కేరళ నుండి రూ. 25 లక్షల రూపాయల విలువైన రూ. 2,000 నోట్లు బెంగళూరుకు తీసుకువచ్చాడు.

ఆ తర్వాత రూ 2,000 నకిలీ నోట్లను హలసూరు గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిజర్వ్ బ్యాంక్ లోకి తీసుకెళ్లిన అఫ్జల్ఈ నోట్లన్నీ మార్చుకునే తనకు రూ. 500 నోట్లు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు మనవి చేశాడు. ప్రభుత్వ నియమాల ప్రకారం చెల్లని రూ. 2,000 నోట్లు వెనక్కి తీసుకుని, ఎంత కమిషన్ అయితే అంత డబ్బులు పట్టుకొని మిగిలినవి రూ 500 నోట్లు ఇవ్వాలని అఫ్జల్ రిజర్వ్ బ్యాంక్ అధికారులకు మనవి చేశాడు.

Fake notes of Rs 25 lakh seized from RBI office in Bengaluru city

ఎన్నో సంవత్సరాల క్రితం బ్యాన్ చేసిన రూ 2,000 రూపాయల విలువైన రూ. 25 లక్షలు తీసుకుని బ్యాంకుకు రావడంతో రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఆ నోట్లను పరిశీలించారు. అఫ్జల్ తీసుకొచ్చినవి నకిలీ నోట్లు అని గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ అధికారులు వెంటనే హలసూరు గేట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హలసూరు గేట్ పోలీసులు రిజర్వ్ బ్యాంక్ కు చేరుకొని దొంగ నోట్లు మార్పిడి చేయడానికి ప్రయత్నించిన అఫ్జల్ ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీస్ స్టేషన్ లో అఫ్జల్ ను బెండ్ తీస్తే కేరళలోని కాసరగూడూ నుండి తాను నకిలీ నోట్లో తీసుకొని బెంగళూరు వచ్చానని అఫ్జల్ అంగీకరించాడు. అబ్దుల్ ఇచ్చిన సమాచారం మేరకు బెంగళూరు పోలీసులు కేరళలోని కాసరగూడుకు వెళ్లారు. కాసరగూడులో అన్వర్, ప్రసిద్ తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. కాసరగూడులొ మరో రూ. 27 లక్షల రూపాయల రూ. 2, 000 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు కాసరగూడులోని ఓ ఇంటిలో దొంగ నోట్లు ముద్రించడానికి ప్రింటింగ్ మిషన్, కలర్ జిరాక్స్, పేపర్లు నిల్వ చేశారని పోలీసులు అన్నారు. కేరళలోని కాసరగూడులో నకిలీ నోట్లు ముద్రిస్తున్న నిందితులు ఆ తర్వాత ఆ నకిలీ నోట్లను బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో చలామణి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. నిందితులు ఎంత విలువైన నకిలీ నోట్లు ముద్రించారు, ఎక్కడెక్కడ ఆ నకిలీ నోట్లు చలామణి చేశారు అని ఆరా తీస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు. కేరళలో ముద్రించిన నకిలీ నోట్లను బెంగళూరులోని రిజర్వ్ బ్యాంక్ కు తీసుకొచ్చి వాటిని మార్చడానికి ప్రయత్నించిన నిందితులు అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+