రూ. 33 వేల కోట్ల స్కాం: కరీంలాలా తెల్గీ చచ్చాడు: పట్టించిన వ్యక్తికి అందని రూ. 44 కోట్ల బహుమానం !

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. 33 వేల కోట్లరూపాయల నకిలి స్టాంప్ పేపర్ల కుంబకోణంలో ప్రధాన నిందితుడు కరీంలాలా తెల్గీని పోలీసులకు పట్టించిన వ్యక్తికి నేటికీ కేంద్ర ప్రభుత్వం నగదు బహుమానం ఇవ్వలేదు. చ

బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. 33 వేల కోట్లరూపాయల నకిలి స్టాంప్ పేపర్ల కుంబకోణంలో ప్రధాన నిందితుడు కరీంలాలా తెల్గీని పోలీసులకు పట్టించిన వ్యక్తికి నేటికీ కేంద్ర ప్రభుత్వం నగదు బహుమానం ఇవ్వలేదు. చివరికి కరీంలాలా తెల్గీ ఆనారోగ్యంతో మరణించాడు.

కరీంలాలా తెల్గీని పట్టించి 17 ఏళ్లు పూర్తి అయినా తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందవలసిన రూ. 44 కోట్ల బహుమానం అందలేదని అతన్ని పట్టించిన జయంత్ తినైకర్ వాపోతున్నారు. కరీంలాలా తెల్గీ అనారోగ్యంతో బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్ర మరణించాడు.

Fake stamp paper scam Jayant Tinaikar yet to receive cash prize

కరీంలాల్ తెల్గీ మరణించాడని తెలుసుకున్న అతన్ని పట్టించిన జయంత్ తినైకర్ గురువారం కర్ణాటకలోని బెళగావిలో మీడియాతో మాట్లాడారు. 17 ఏళ్ల కిత్రం కరీంలాలా తెల్గీ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బెళగావి చేరుకున్నాడు. అనేక రాష్ట్రాల పోలీసులు కరీంలాలా తెల్గీ కోసం గాలిస్తున్నారు.

అన్ని రాష్ట్రాల పోలీసులు కరీంలాలా తెల్గీని పట్టుకోలేకపోయారు. బెళగావిలోని ఖానాపుర రైల్వే స్టేషన్ లో కరీంలాలా తెల్గీ పండ్లు అమ్మే చిరువ్యాపారిగా అవతారం ఎత్తాడు. పండ్లు అమ్ముతున్న చిరువ్యాపారిగా నటిస్తున్న కరీంలాలా తెల్గీ విలాసవంతమైన జీవితం గడిపాడు.

ఆ సందర్బంలో జయంత్ తినైకర్ కు అనుమానం వచ్చి ఆరా తీశారు. అతనే కరీంలాలా తెల్గీ అని గుర్తించి వెంటనే అప్పటి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సాంగ్లియానకు సమాచారం ఇచ్చారు. బెంగళూరు పోలీసు కమిషనర్ సాంగ్లియాన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకుని బెళగావి వెళ్లారు.

Fake stamp paper scam Jayant Tinaikar yet to receive cash prize

అదే సమయంలో కరీంలాలా తెల్గీ రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాకు వెళ్లాడు. ఆజ్మీర్ దర్గాలోనే జయంత్ తిలైకర్ కరీంలాలా తెల్గీ పోలీసులకు పట్టించారు. కరీంలాలా తెల్గీని పట్టిస్తే రూ. 44 కోట్లు బహుమానం ఇస్తామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కరీంలాలా తెల్గీని పట్టించినందుకు ఇప్పటి వరకూ తనకు రూ. 44 కోట్లు బహుమానం రాలేదని అతన్ని పట్టించిన జయంత్ తిలైకర్ వాపోతున్నారు. నాకు ప్రాణహాని ఉందని చెప్పినా తనకు కల్పించిన భద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించిందని జయంత్ తిలైకర్ వాపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+