Fake : ప్రభుత్వానికి మత పెద్ద హెచ్చరికలు.. ఆ వీడియో భారత్‌లో జరిగింది కాదు..

కరోనా వైరస్ వ్యాప్తి కంటే ఫేక్ న్యూస్‌తో తలనొప్పి ఎక్కువైంది. కుప్పలు తెప్పలుగా ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీంతో ఏది నిజమో.. ఏది అబద్దమో తేల్చుకోలేక సామాన్యులు గందరగోళానికి గురవుతున్నారు. ప్రత్యేకించి ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కొన్ని ఫేక్ వార్తలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో వెలుగుచూసింది.

మసీదుల్లోకి నిషేధంపై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించాలని ఓ మత పెద్ద అందులో సందేశమివ్వడం కనిపిస్తోంది. ఒకవేళ మసీదుల్లోకి ఐదుగురికి మించి ప్రభుత్వం అనుమతించకపోతే.. దాన్ని ధిక్కరించేందుకు తమవాళ్లు ప్రాణ త్యాగానికైనా సిద్దమని అందులో ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియోను భారత్‌లో జరిగినదిగా పేర్కొంటూ కొంతమంది సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది నిజమేనని నమ్మి చాలామంది షేర్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

fake : Video of cleric challenging closure of Mosques is from Pakistan, not India

అయితే వాస్తవమేంటంటే.. ఈ ఇది భారత్‌లో జరిగిన సంఘటన కాదు. ఈ నెల ఆరంభంలో పాకిస్తాన్‌లో ఇది జరిగింది. పాకిస్తాన్‌లోని మన్షేరాలో జరిగిన ఓ వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా జమాత్ ఉలేమా-ఈ-ఇస్లామా(F) నాయకుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మసీదుల్లోకి తమకు అనుమతివ్వకపోతే.. దీని వెనకాల అమెరికా కుట్ర దాగుందని భావించాల్సి వస్తుందన్నారు. ప్రాణ త్యాగానికైనా సిద్దమే తప్ప.. మసీదుల్లోకి వెళ్లవద్దంటే కుదరదని హెచ్చరించారు.

ఓ ట్విట్టర్‌ యూజర్ కూడా దీన్ని ధ్రువీకరించాడు. ఇది పాకిస్తాన్‌లో జరిగిన ఘటన అని.. ఆ ప్రసంగం చేసి కిఫయతుల్లాను అరెస్ట్ కూడా చేశారని చెప్పాడు. ఈ వీడియో చూసిన ప్రతీసారి.. అల్లా మాపై దయ ఉంచాలని.. ఇలాంటి మూర్ఖుల నుంచి తమను రక్షించాలని ప్రార్థిస్తున్నట్టు ట్విట్టర్‌లో అతను పేర్కొనడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+