షిరిడీ సాయితో డైరెక్టు కాంటాక్ట్.. మీ పాపాలు తొలగిస్తా.. లేడీ బాబా కొంపముంచిందిగా..!
ముంబై : రోగాలు నయం చేస్తానంటూ లక్షలు గుంజింది. అంతేకాదు మీ కుటుంబ సభ్యుల చిక్కులు తొలగిస్తానంటూ ఉన్నకాడికి ఊడ్చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏకంగా షిరిడీ సాయి పేరునే వాడేసింది. బాబాతో డైరెక్టుగా మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ నమ్మించింది. ఆ మాయ లేడీ కిలాడీ చెప్పినదానికి గొర్రెలా తలూపిన బాధితురాలు లక్షలు పోగొట్టుకున్నాక గానీ కళ్లు తెరవలేదు.
తనకు తాను దైవాంశ సంభూతురాలిగా ప్రకటించుకున్న ఓ లేడీ బాబా అమాయకురాలిని నట్టేట ముంచింది. చెప్పినదానికి తలూపడంతో గొర్రెలా భావించి అందినకాడికి దండుకుంది. ముంబైలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బాధితురాలి బాధను ఆసరాగా చేసుకుని 12 లక్షల 75 వేల రూపాయల వరకు లాగేసింది సదరు ఫేక్ బాబా.

ముంబైకి చెందిన కిరణ్ దారువాలా అలియాస్ గురుమ.. దైవాంశ సంభూతురాలిగా చలామణీ అవుతోంది. అమాయకులను బుట్టలో వేసుకుంటూ తన పైత్యాన్ని రుచి చూపిస్తోంది. సమస్యల పరిష్కారానికి దారి చూపుతానంటూ.. బాధితుల నుంచి లక్షలకు లక్షలు గుంజుతోంది. ఆ క్రమంలో ముంబైలోని ఖార్ పశ్చిమ ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల మహిళ ఇటీవల సదరు బురిడీ బాబాను సంప్రదించారు. అత్తగారి ఆరోగ్యం బాగాలేదని.. ఇంట్లో తరచూ సమస్యలు వస్తున్నాయని.. ఎలాగైనా అవి పరిష్కారం అయ్యేలా మార్గం చూపాలని కోరారు.
అయితే ఆ మహిళ బాధను అర్థం చేసుకోపోగా.. ఉల్టా ఆమెను మరింత ఇరకాటంలో పడేసింది ఆ లేడీ కిలాడీ. దైవ శక్తులతో సమస్యలు పారిపోయేలా చేస్తానంటూ నమ్మించి మోసం చేసింది. పోయిన జన్మలో నీతో పాటు నీ భర్త పాపాలు చేసిన ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారని కల్లిబొల్లి మాటలు చెప్పింది. రోజులు గడుస్తున్నా ఆమె సమస్యలు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్న చందంగా ఉండటంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. పూజల పేరుతో తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడమే గాకుండా.. ఫేక్ బాబా అనుచరులు తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బురిడీ బాబా ఆట కట్టించి అరెస్ట్ చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications