False : ఆ చట్టాన్ని రద్దు చేయలేదు.. ఆ ప్రచారంలో నిజం లేదు..
లింగ నిర్ధారణ, భ్రూణహత్యలను నివారించేందుకు ఉద్దేశించిన పీసీ&పీఎన్‌డీటీ చట్టం 1994ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రద్దు చేసిందని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని కేంద్రం వెల్లడించింది. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది.

COVID-19 మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా కొనసాగుతున్న లాక్ డౌన్ దృష్ట్యా, పీసీ & పీఎన్‌డీటీ చట్టం 1996 ప్రకారం కొన్ని నిబంధనలను తాత్కాలికంగా వాయిదా వేయడానికి/నిలిపివేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 4, 2020 నాటి నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం క్లినిక్స్,ల్యాబోరేటరీలు,జెనెటిక్ కౌన్సెలింగ్ సెంటర్ల రెన్యువల్ గడువు ఈలోగా ముగిసిపోతే.. రిజిస్ట్రేషన్ పునరుద్దరణ కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అలాగే అల్ట్రా సౌండ్ క్లినిక్స్,జెనెటిక్ ల్యాబోరేటరీలు,జెనెటిక్ కౌన్సెలింగ్ సెంటర్స్ చట్టంలో నిర్దేశించినట్టుగా రోజూవారీ రికార్డులు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో నిబంధనల సడలింపుకు ఎలాంటి అవకాశం లేదు.












Click it and Unblock the Notifications