False News:గుజరాత్‌లో సైన్యం మోహరింపు వార్తల్లో నిజం లేదన్న ఇండియన్ ఆర్మీ
న్యూఢిల్లీ: కరోనావైరస్ పై సోషల్ మీడియాలో చాలా వదంతులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వదంతులను నమ్మి పలువురు నష్టాలు కోరి తెచ్చుకున్నారు కూడా. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను లేదా వదంతులను నమ్మొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వం సూచించిన విధానాలనే పాటించాలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇక తప్పుడు వార్తలపై కూడా ప్రభుత్వం నిఘా పెంచింది. అవాస్తవాలను అదే పనిగా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలకు దిగుతోంది ప్రభుత్వం.
తాజాగా ప్రింట్ ఎలక్ట్రానికి మీడియాలో ఓ వార్త ప్రసారం అయ్యింది. ఇదే వార్త సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొట్టింది. గుజరాత్‌లో ఆర్మీని కేంద్రం మోహరించిందనే వార్త తెగ వైరల్ అయ్యింది. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో సెలవుపై వెళ్లిన ఆర్మీ ఉద్యోగులు, రిటైర్ కానున్న ఉద్యోగులను గుజరాత్‌లో పోస్టింగ్ ఇస్తున్నట్లు సర్క్యులేట్ అవుతున్న వార్తలో ఉంది. అయితే దీనిపై భారత ఆర్మీ స్పందించింది. ఇలా సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

గుజరాత్‌లో ఆర్మీని మోహరిస్తున్నట్లు ప్రింట్ మీడియాలో తప్పుడు వార్తలు వచ్చాయని అందులో నిజం లేదని ఏడీజీ పీఐ స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో లేదా పుకార్ల ద్వారా వచ్చినప్పుడు ఉన్నతాధికారులతో ఒక్కసారి నిర్థారణ తీసుకున్న తర్వాతే నిజమైతేనే ప్రచురించాలని ఏడీజీ కోరారు. ఇలాంటి వార్తలు గతంలో కూడా వచ్చాయని ఆయన గుర్తుచేశారు. ఆర్మీ మోహరింపుపై చాలా తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పౌర నివాసాల్లో ఆర్మీని మోహరింపచేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని అధికారులు వెల్లడించారు. లాక్‌డౌన్ సమయంలో శాంతిభద్రతలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే హ్యాండిల్ చేస్తున్నాయని ఎక్కడా ఆర్మీని మోహరింప చేయలేదని స్పష్టం చేశారు. కాబట్టి గుజరాత్‌లో సైన్యంను మోహరిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications