Family: ఇంట్లో భార్యతో గొడవలు, కూతర్లతో కలిసి బావిలో దూకేసిన తండ్రి, ముగ్గురి జీవితాలు, భార్య !

చెన్నై/చెంగల్పట్టు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తూ ఇద్దరు కూతుర్లకు తండ్రి అయ్యాడు. సొంతంగా ఆటో నడుపుతున్న అతను భార్య, బిడ్డలను సంతోషంగా చూసుకుంటున్నాడు. కొంతకాలంగా దంపతుల మద్య ఓ విషయంలో గొడవలు మొదలైనాయి. వయసుకు వస్తున్న కూతుర్లకు విషయం తెలిస్తే పరువు పోతుందని తండ్రి ఆవేదన చెందాడు. కూతుర్లు ఇంట్లో లేని సమయంలో అతని భార్యను మందలిస్తూ వచ్చాడు. అయితే దంపతుల మద్య గొడవలు మాత్రం సర్దుమనగలేదు. కూతుర్లును పిలుచుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిన తండ్రి తరువాత అడ్రస్ లేకుండా పోయాడు. తన భర్త, ఇద్దరు కూతుర్లు కనపడటం లేదని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో ఓ తాగునీటి బావిలో తండ్రి, ఇద్దరు కూతుర్లు శవమై కనిపించడం కలకలం రేపింది.

కొంతకాలం వరకు హ్యాపీలైఫ్

కొంతకాలం వరకు హ్యాపీలైఫ్


చెన్నైలోని పుతుప్ పేటై పచ్చయప్పన్ వీధిలో జ్ఞానవేల్ (44) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జ్ఞానవేల్ జయంతి (39) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. జ్ఞానవేల్, జయంతి దంపతులకు ఐశ్వర్య, పూజా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య జయంతి, ఇద్దరు కూతుర్లతో కలిసి జ్ఞానవేల్ కొంతకాలం క్రితం చాలా సంతోషంగా ఉండేవాడు.

ఓ విషయంలో దంపతు మధ్య గొడవలు

ఓ విషయంలో దంపతు మధ్య గొడవలు


సొంతంగా ఆటో నడుపుతున్న జ్ఞానవేల్ అతని భార్య జయంతి, ఇద్దరు కూతుర్లను సంతోషంగా చూసుకుంటున్నాడు. కొంతకాలంగా జ్ఞానవేల్, జయంతి దంపతుల మద్య ఓ విషయంలో గొడవలు మొదలైనాయి. వయసుకు వస్తున్న కూతుర్లకు విషయం తెలిస్తే పరువు పోతుందని జ్ఞానవేల్ ఆవేదన చెందుతున్నాడని తెలిసింది.

పండుగ రోజు సేమ్ సీన్

పండుగ రోజు సేమ్ సీన్


కూతుర్లు ఇంట్లో లేని సమయంలో జ్ఞానవేల్ అతని భార్య జయంతిని మందలిస్తూ వచ్చాడు. అయితే జ్ఞానవేల్, జయంతి దంపతుల మద్య గొడవలు మాత్రం సర్దుమనగలేదని తెలిసింది. సంక్రాంతి పండుగ రోజు కూడా జ్ఞానవేల్, జయంతి దంపతుల మధ్య గొడవ జరిగిందని, ఆ సమయంలో బంధువులు ఇద్దరికి సర్ది చెప్పారని సమాచారం.

కూతుర్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

కూతుర్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

కూతుర్లు ఐశ్వర్య, పూజాను పిలుచుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిన జ్ఞానవేల్ తరువాత అడ్రస్ లేకుండా పోయాడు. తన భర్త జ్ఞానవేల్, ఇద్దరు కూతుర్లు కనపడటం లేదని జయంతి చెన్నైలోని ఎంగ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో చెంగల్పట్లు సమీపంలోని మరైమలై నగర్ దగ్గర ఉన్న కండవూర్ గ్రామంలోని ఓ తాగునీటి బావిలో జ్ఞానవేల్, అతని ఇద్దరు కూతుర్లు శవమై కనిపించడం కలకలం రేపింది.

మ్యాటర్ మాత్రం తెలీదు

మ్యాటర్ మాత్రం తెలీదు

బావి సమీపంలోనే ఆటో కూడా నిలిపి ఉందని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కూతుర్లతో కలిసి జ్ఞానవేల్ ఆత్మహత్య చేసుకోవడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, జయంతిని విచారణ చేస్తున్నామని, కేసు విచారణలో ఉందని చెన్నైలోని ఎంగ్మూర్ పోలీసులు, చెంగల్పట్టు పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+