బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Family: ఎడిటర్ ఫ్యామిలీలో ఒకేసారి ఐదు మంది ఆత్మహత్య, శవాల పక్కన మూడు రోజులు చిన్నారి, షాక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జీవితంపై విరక్తి చెందిన ఒకే కుటుంబంలోని ఐదు మంది ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఓ మాసపత్రిక ఎడిటర్ ఫ్యామిలీలో ఐదు మంది ఒకే సారి ఆత్మహత్య చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఐదు మృతదేహాల పక్కన మూడు రోజు పాటు మూడు సంవత్సరాల చిన్నారి కాలం గడిపింది. మూడు రోజుల పాటు తిండి, నీళ్లు లేకపోవడంతో ఆ చిన్నారి అనారోగ్యం పాలైయ్యింది. తల్లీ, ఇద్దరు కూతురళ్లతో పాటు ఓ యువకుడు, 9 నెలల చిన్నారి ఆత్మహత్య చేసుకున్న మూడు రోజుల తరువాత విషయం బయటకు రావడంతో అప్పటికే మృతదేహాలను నుంచి దుర్వాసన వస్తోంది. మాసపత్రిక ఎడిటర్ ఇంటిలో లేని సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవడం ఐటీ హబల్ లో హాట్ టాపిక్ అయ్యింది.

Illegal affair: కూతురి మొగుడితో అత్త ఫుల్ రొమాన్స్, ఫ్యామిలీ దెబ్బతో అల్లుడు ఫినిష్, ఐదు మంది !Illegal affair: కూతురి మొగుడితో అత్త ఫుల్ రొమాన్స్, ఫ్యామిలీ దెబ్బతో అల్లుడు ఫినిష్, ఐదు మంది !

మాసపత్రిక ఎడిటర్ ఫ్యామిలీ

మాసపత్రిక ఎడిటర్ ఫ్యామిలీ

ఐటీ హబ్ బెంగళూరు సిటీలోని బ్యాడరహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిగరపాళ్యలో శంకర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శంకర్ ఓ మాసపత్రిక నిర్వహిస్తున్నాడు. మాసపత్రిక చీఫ్ ఎడిటర్ శంకర్. శంకర్ కు భార్య భారతి (50), సించనా (34), సింధూరాణి (31) కుమార్తెలు, మధుసాగర్ (25) తోపాటు సింధూరాణి 9 నెలల చిన్నారి ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే ఇంటిలో సించనా మూడు సంవత్సరాల కూతురు ప్రాణాలతో బయటపడింది.

ఊరికి వెళ్లిన ఇంటి యజమాని

ఊరికి వెళ్లిన ఇంటి యజమాని

ఐదు రోజుల క్రితం మాసపత్రిక ఎడిటర్ శంకర్ వ్యక్తిగత పనిమీద బయటకు వెళ్లాడు. కాన్పుకోసం వచ్చిన సింధూరాణి వారి ఇంటిలోనే ఉండిపోయింది. సింధూరాణి 9 నెలల చిన్నారితో పాటు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మూడు రోజుల నుంచి శంకర్ అతని భార్య భారతికి పదేపదే ఫోన్ చేసినా ఆమె ఫోన్ రిసీవ్ చెయ్యలేదు.

అనుమానంతో బెంగళూరు వచ్చేసిన శంకర్

అనుమానంతో బెంగళూరు వచ్చేసిన శంకర్

మూడు రోజుల నుంచి భార్య భారతి ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో శంకర్ కు అనుమానం వచ్చి నేరుగా ఇంటికి వచ్చాడు. ఇంటి లోపల తలుపులు లాక్ చేసి ఉండటంతో శంకర్ కిటికిలో నుంచి లోపలికి చూశాడు. ఇంటి లోపల భార్య భారతీ, కూతుర్తు సింధూరాణి, సించనా, మధుసాగర్, చిన్నారి శవమై కనిపించడంతో వాటిని వీడియో తీసిన శంకర్ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడని బెంగళూరు పశ్చిమ విభాగం డీసీపీ సంజీవ్ పాటిల్ మీడియాకు చెప్పారు.

కుమార్తెలకు వివాహం చేసిన శంకర్

కుమార్తెలకు వివాహం చేసిన శంకర్

శంకర్, భారతి దంపతులు వారి కుమార్తెలు సించనా, సింధూరాణికి వివాహాలు చేసి వారిని అత్తారింటికి పంపించారు. కాన్పుకోసం పుట్టింటికి వచ్చిన సింధూరాణి పాప పుట్టిన తరువాత ఇక్కడే ఉంది. శంకర్ ఇంటిలో లేని సమయంలో ఐదు మంది ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మూడు రోజుల పాటు తిండి నీళ్లు లేక చిన్నారి ఐదు శవాల పక్కన ఏడుస్తూ కాలం గడిపిందని ఊపిరి ఆడక చాలా ఇబ్బంది పడిందని, తలుపులు తీసి చూడగా చిన్నారని కిందపడి ఉందని, వెంటనే ఆసుపత్రికి తరలించామని డీసీపీ సంజీవ్ పాటిల్ మీడియాకు చెప్పారు.

Recommended Video

సింగరేణి బాదిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలన్న షర్మిళ!!
కుటుంబ సమస్యలే కారణం ?

కుటుంబ సమస్యలే కారణం ?

కుటుంబ సమస్యల కారణంగా ఒకే కుటుంబంలో ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారని అనుమానం ఉందని, కేసు విచారణలో ఉందని డీసీపీ సంజీవ్ పాటిల్ మీడియాకు చెప్పారు. మాసపత్రిక ఎడిటర్ ఫ్యామిలీలోని ఐదు మంది ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం బెంగళూరు నగరంలో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Family: Five members of a same family committed suicide in a house in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X