Family Man -2: సమంతా-షాహాబ్ అలీ మధ్య హాట్ సీన్స్ తొలిగించారట..ఉంటే బొమ్మ మరింత బ్లాక్ బస్టరే.!

కరోనా కష్టకాలంలో సినిమా షూటింగులకు బ్రేక్ పడింది. అంతేకాదు లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు కూడా మూతపడ్డాయి. ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఎత్తేసినప్పటికీ థియేటర్లకు వచ్చేందుకు ప్రేక్షకులు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఈ సమయంలోనే చాలావరకు ఓటీటీలు వెలిశాయి. ప్రేక్షకులు కూడా హాయిగా ఇంట్లోనే కూర్చొని ఓటీటీలపై తమకు నచ్చిన సినిమాలను చూసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. ఇక ఓటీటీలపై విడుదలయ్యే చిన్న సినిమాలు కాస్త శృతి మించుతున్నాయనే చెప్పాలి. వెబ్‌సిరీస్‌లైతే ఇక చెప్పక్కర్లేదు. ఫ్యామిలీతో కూర్చుని చూడాలంటే కాస్త వెనకడుగు వేయాల్సిందే. తాజాగా సమంత అక్కినేని నటించిన ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్ సిరీస్‌లో సమంత నటించిన కొన్ని హాట్ సీన్స్‌ను ఎడిటింగ్‌లో కట్ చేసినట్లు నటుడు షాహాబ్ అలి చెప్పాడు.

Recommended Video

    The Family Man 2 Review | Samantha, Screenplay రెండూ సూపర్ !! || Oneindia Telugu

    ది ఫ్యామిలీ మ్యాన్ - 2 వెబ్ సిరీస్‌‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. జూన్ 3వ తేదీన విడుదలైన ఈ వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. అయితే ఈ సినిమా గురించి మాట్లాడుతూ నటుడు షాహాబ్ అలీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంత తన మధ్య జరిగిన కొన్ని హాట్ సన్నివేశాలను చివరి నిమిషంలో కట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. షాహాబ్ అలీ - సమంత మధ్య కథ డిమాండ్ చేయడంతో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని అవి షూట్ చేశాక చివరి నిమిషంలో కట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. కేవలం రొమాంటిక్ సీన్స్ మాత్రమే కాదు.. సిరీస్ నిడివి చాలా ఉన్నందున ఇతర సీన్లు కూడా ఎడిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించాడు.

    Family Man-2:Romantic scenes between Samantha and me were cut in editing, Reveals Actor Shahab Ali

    ఇద్దరి మధ్య జరిగిన ప్రేమయాణంకు సంబంధించిన సీన్లు కట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. కొన్ని సీన్లు అనవసరం అనిపించి కట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఏవైతో కథానుగుణంగా ఉన్నాయో కథ ఫ్లోకు తగ్గట్టుగా ఉన్నాయో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఇతరత్రా అనవసర సీన్లన్నీ తీసేశామని చెప్పాడు. ఇక సినిమా విషయానికి వస్తే సమంతా షాహాబ్ ఇద్దరూ అతివాదులుగా నటించారు. భారత్‌లో ఆత్మాహుతి దాడులు చేయాలని భావించి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సమంత శ్రీలంకకు చెందిన తమిళ అమ్మాయి రాజ్జి పాత్రను పోషించింది. ఇక షాహాబ్ అలీ కశ్మీర్‌కు చెందిన సాజిద్ పాత్రను పోషించాడు.

    ఇదిలా ఉంటే సమంతా అక్కినేని ఇప్పటి వరకు పోషించిన పాత్రలు పరిధిలోనే ఉన్నాయన్న మంచి పేరుంది. అయితే కథ డిమాండ్ చేయడంతో సమంతా - షాహాబ్ అలీల మధ్య రొమాంటిక్ సీన్స్ చాలా హాట్‌గా ఉన్నాయనే మాట ఇటు బాలీవుడ్‌లో అటు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా షాహాబ్ అలీ తన ఇంటర్వ్యూలో హాట్ సీన్స్ గురించి రివీల్ చేయడంతో మళ్లీ ఈ సినిమాపై చర్చ ప్రారంభమైంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+