Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ ఇన్సిడెంట్: కాల్పులు జరిపింది మైనర్, సర్టిఫికెట్.. కాదంటున్న పోలీసులు

హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలో హింసాత్మక ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ర్యాలీ తీస్తుండగా.. కొందరు మూకలు కాల్పులు కూడా జరిపారు. అయితే దీనికి సంబంధించి కొత్త విషయం తెలిసింది. శనివారం సాయంత్రం జహంగిరిపురిలో ఓ యువకుడు కాల్పులు జరిపారు. అతనిని ఆదివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను మైనర్ ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు. అంతేకాదు అతని వయస్సు నిర్దారణ కోసం సర్టిఫికెట్లు కూడా చూపిస్తున్నారు.

యువకుడి బర్త్ సర్టిఫికెట్ కూడా చూపించారు. అతను 2005లో జన్మించాడని చెప్పారు. అయితే పోలీసుల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ రాశామని.. అతని వయస్సు 22 ఏళ్లు అని చెప్పారు. ఢిల్లీ ఘటనలో ఇప్పటికే 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడే కాదు 2020లో కూడా అతను ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడని చెప్పారు. ఇప్పటికే అతని నుంచి పిస్తోల్ సేకరించామని చెప్పారు.

Family of accused who opened fire during Hanuman Jayanti rally in Delhi claims hes minor

ఢిల్లీలో జరిగిన హనుమాన్ జయంతి ర్యాలీలో హింస చెలరేగింది. కొంతమంది పోలీసులకు గాయాలు కాగా, కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. జహంగీర్ పూరి ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ హింసకు దారితీసింది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా హింస చెలరేగడంతో ఈ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జహంగీర్ పూరి ప్రాంతంలో భారీగా పోలీసుల్ని మొహరించారు. రెండు వర్గాల మధ్య హింస చెలరేగిందని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

బీజేపీ నేత కపిల్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతమంతా బంగ్లాదేశ్ చొరబాటుదారులతో నిండిపోయుందని చెప్పారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు మన పౌరులపై దాడి చేసే స్థాయికి చేరుకున్నారని ఆరోపించారు. వారి ధృవపత్రాలు తనిఖీ చేసి..చొరబాటుదారుల్ని దేశం నుంచి పంపించేయాలని ట్వీట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+