Family: నెలకు రూ. 2. 50 లక్ష జీతం, అపార్ట్ మెంట్ లో భార్య, పిల్లలను చంపేసి బ్యాంకు అధికారి ?, గేమ్ !
చెన్నై: బ్యాంకులో సీనియర్ అధికారిగా మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి లక్షల రూపాల జీతం తీసుకుంటున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి విలాసవంతమైన లగ్జరీ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. ప్రతిరోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తున్న భర్త అతని భార్య, పిల్లలతో ఇంతకాలం సంతోషంగా బయటతిరుగుతూ ఎంజాయ్ చేశాడు. అయితే ఆన్ లైన్ గేమ్, చెడు సవాసాలకు అలవాటుపడిన బ్యాంకు అధికారి విపరీతంగా అప్పులు చేశాడు. అప్పులు తీర్చడానికి మళ్లీ స్నేహితుల దగ్గర అప్పులు చేశాడు. నూతన సంవత్సరం వేడుకులకు వెళ్లే విషయంలో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో సహనం కోల్పోయిన భర్త అతని భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేశాడు. ఇద్దరు బిడ్డలను హత్య చేసిన బ్యాంకు అధికారి అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

నెలకు రూ. 2.50 లక్షల జీతం
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన మణికందన్ అలియాస్ మణి (36) చెన్నై చేరుకుని పోరూర్ లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో వైస్ ప్రెసిడెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. బ్యాంకులో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న మణికందన్ నెలకు రూ. 2.50 లక్షలకు పైగా జీతం తీసుకుంటున్నాడు. లక్షల్లో జీతం తీసుకుంటున్న మణికందన్ సంతోషంగా ఉండేవాడు.

విలాసవంతమై ఫ్లాట్ లో భార్య, పిల్లలు
మణికందన్ తారా (35) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మణికందన్, తారా దంపతులకు తరుణ్ (10), ఏడాది వయసు ఉన్న దహన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. చెన్నైలోని పెరియార్ రోడ్డులోని ఫాలింగ్ వాటర్ అపార్ట్ మెంట్ లోని 7వ అంతస్తులోని విలాసవంతమైన ఫ్లాట్ లో మణికందన్, తారా దంపతులు వారి ఇద్దరి కుమారులతో కలిసి నివాసం ఉంటున్నారు.

ఎంజాయ్ చేసిన బ్యాంకు అధికారి
భార్య తారా, ఇద్దరు కొడుకులతో కలిసి విలాసవంతమైన లగ్జరీ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న మణికందన్ హ్యాపీగా ఉండేవాడు. ప్రతిరోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తున్న మణికందన్ అతని భార్య తారా, ఇద్దరు పిల్లలతో కొన్ని నెలల క్రితం వరకు సంతోషంగా బయటతిరుగుతూ ఎంజాయ్ చేశాడు.

నూతన సంవత్సరం వేడుకలకు ?
డిసెంబర్ 31వ తేదీ రాత్రి నూతన సంవత్సరం వేడుకుల కోసం బయటకు వెళ్లే విషయంలో మణికందన్, తారా దంపతుల మధ్య గొడవలు జరిగాయని సమాచారం. జనవరి 1వ తేదీ కూడా మణికందన్, తారా దంపతులు, వారి పిల్లలు అపార్ట్ మెంట్ లో నుంచి బయటకు రాలేదు. మణికందన్, తారా దంపతులు వారి పిల్లలతో కలిసి బయటకు వెళ్లి ఉంటారని చుట్టుపక్కల ఫ్లాట్స్ లో నివాసం ఉంటున్న వాళ్లు అనుకున్నారు.

భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేశాడు
జనవరి 2వ తేదీ కూడా మణికందన్, తారా దంపతులు కనపడకపోవడం, ఇంటికి తాళం వేసి ఉండటంతో అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారిని అనుమానం వచ్చి దుర్గా పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా మణికందన్ అతని భార్య తారాను క్రికెట్ బ్యాట్ తో కొట్టి హత్య చేసిన విషయం వెలుగు చూసింది.

పిల్లలను చంపేసి బ్యాంకు అధికారి ఆత్మహత్య
భార్య తారాను చంపేసిన తరువాత మణికందన్ అతని ఇద్దరు కొడుకులు తరుణ్, దహన్ ల గొంతులు కోసి చంపేశాడు. తరువాత అపార్ట్ మెంట్ లోనే గదిలో మణికందన్ ఉరి వేసుకున్న విషయం గుర్తించిన పోలీసులు, బంధువులు హడలిపోయారు. సంఘటనా స్థలంలో పరిశీలించి నలుగురి శవాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

రెండు నెలలుగా ఉద్యోగానికి వెళ్లలేదు
మణికందన్ గత రెండు నెలల నుంచి ఉద్యోగానికి వెళ్లకుండా అపార్ట్ మెంట్ లోనే ఉంటున్నాడని, బయటకు వెళ్లినా బ్యాంకు వైపు కన్నెత్తికూడా చూడలేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఆన్ లైన్ గేమ్ లో భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న మణికందన్ స్నేహితుల దగ్గర భారీ మొత్తంలో అప్పులు చేశాడని, అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేశాడని, చెడుఅలవాట్లకు బానిసై మణికందన్ రెండు నెలల నుంచి టెన్షన్ గా జీవిస్తున్నాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. అయితే మణికందన్ అతని భార్య తారా, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకోవడానికి ఇప్పటి వరకు కచ్చితమైన ఆధారాలు చిక్కలేదని వాళ్ల కుటుంబ సభ్యులు అంటున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications