Father: తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, పెళ్లి చేసుకుని గాలికి తిరుగుతున్న కొడుకు, ఆస్తి కోసం తండ్రినే ?
చెన్నై/కొడైక్కెనాల్: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కొడుక్కి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న తరువాత కూడా కొడుకు ఎలాంటి పని చెయ్యకుండా గాలికి తిరుగుతూ అతని భార్యతో కలిసి తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాడు. కొడుకు కోడలిని ప్రభుత్వ ఉద్యోగి పెంచి పోషిస్తున్నాడు. రాత్రి ఇంటికి వెళ్లిన కొడుకు అతని తండ్రితో గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో కొడుకు అతని తండ్రి మీదదాడి చేసి చంపేశాడు.

బేకార్ కొడుకు
తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని కొడైక్కెనాల్ లోని కామరాజ్ రోడ్డులో నటరాజన్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొడైక్కెనాల్ మునిసిపాలిటీలో నటరాజన్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. నటరాజన్ కు ఇద్దరు కుమార్తెలు, దినేష్ (28) అనే కుమారుడు ఉన్నాడు. దినేష్ ఎలాంటి పని చెయ్యకుండా మద్యం సేవిస్తూ గాలికి తిరుగుతున్నాడు.

పెళ్లి అయినా కొడుకు వేస్ట్ గాడు
దినేష్ కు రెండు సంవత్సరా క్రితం పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న తరువాత కూడా దినేష్ ఎలాంటి పని చెయ్యకుండా జులాయిగా తిరుగుతూ అతని భార్యతో కలిసి తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాడు. ఏదైనా పని చెయ్యాలని తండ్రి నటరాజ్ ఎంత చెబుతున్నా దినేష్ మాత్రం పద్దతి మార్చుకోలేదు.

ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్
రాత్రి పీకలదాక మద్యం సేవించిన దినేష్ ఇంటికి వెళ్లి అతని తండ్రి నటరాజన్ తో ఆస్తిలో భాగం పెట్టాలని గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో నటరాజన్, అతని కొడుకు మద్య మాటామాటా పెరిగిపోయింది. సహనం కోల్పోయిన దినేష్ కట్టర్ తీసుకుని అతని తండ్రి నటరాజన్ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు.

తండ్రిని చంపేసిన కిరాతకుడు
కుటుంబ సభ్యులు, స్థానికులు నటరాజన్ ను వెంటనే కొడైక్కెనాల్ ఆసుపత్రికి, అక్కడి నుంచి తేనీ అసుపత్రికి తరలించి నటరాజన్ కు చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం నటరాజన్ ను మదురైలోని రాజాజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై నటరాజన్ చనిపోయాడు. తండ్రి నటరాజన్ హత్య కేసులో అతని కొడుకు శాడిస్టు దినేష్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.












Click it and Unblock the Notifications