Famiy: అత్తను ఇంట్లో నుంచి తరిమేయాలని కోడలి స్కెచ్, కిలాడీ ఎంతకు తెగించిందంటే ?, రాడ్ తో !
బెంగళూరు/తుమకూరు: దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులకు వివాహం అయ్యింది. భర్త చనిపోవడంతో ఆమె ఓ కొడుకు, కోడలు, వారి పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నది. అత్త ఇంట్లో ఉండటం కోడలికి ఇష్టం లేదు. భర్తకు భయపడుతున్న భార్య ఆమె అత్త ఇంట్లో ఉండటానికి అంగీకరించింది. అయితే భర్త బయటకు వెళ్లిన తరువాత కోడలు ఆమె అత్త మీద గొడవ చేస్తోంది. ఇంట్లో ఉన్న కోడలు, ఆమె ఇద్దరు పిల్లలను పిలుచుకుని ఇంటి నుంచి బయటకు పరుగు తీసింది. స్థానికులకు అనుమానం వచ్చి ఇంటిలోకి వెళ్లి చూడగా అత్త తల పగలిపోయి రక్తపుమడుగులో పడి ఉన్న విషయం గుర్తించి గట్టిగా కేకలు వేశారు.

ఇద్దరు కొడుకులు
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కుణిగల్ పట్టణంలోని కేఆర్ఎస్ అగ్రహార లేఔట్ లో చిక్కతాయమ్మ అనే మహిళ నివాసం ఉంటున్నది. చిక్కతాయమ్మకు శివకుమార్, శంకర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం చిక్కతాయమ్మ భర్త చనిపోయాడు. అప్పటికే చిక్కతాయమ్మ కుమారులు శివకుమార్, శంకర్ కు వివాహం చేశారు.

చిన్న కొడుకు ఇంటిలో ?
చిక్కతయామ్మ పెద్ద కొడుకు శివకుమార్, అతని భార్య, పిల్లలు బెంగళూరులో ఉన్నారు. రెండు కొడుకు శంకర్, కోడలు సౌమ్యా వారి పిల్లలు కుణిగల్ లో నివాసం ఉంటున్నారు. చాలాకాలం నుంచి చిక్కతాయమ్మ ఆమె చిన్న కొడుకు శంకర్, కోడలు సౌమ్యా, వారి పిల్లలతో కలిసి కుణిగల్ లోని ఇంటిలో నివాసం ఉంటున్నది.

పెద్ద కొడుకు ఇంటికి వెళ్లిపో
అత్త చిక్కతామయ్మ ఇంట్లో ఉండటం ఆమె కోడలు సౌమ్యాకు ఇష్టం లేదు. భర్త శంకర్ కు భయపడుతున్న సౌమ్యా కొంతకాలం ఆమె అత్త చిక్కతాయమ్మ విషయంలో చూసిచూడనట్లు ఉండేది. అయితే అత్త చిక్కతాయమ్మ ఇంట్లో ఉండటం సౌమ్యాకు ఏమాత్రం ఇష్టం లేదు. భర్త శంకర్ బయటకు వెళ్లిన తరువాత సౌమ్యా ఆమె అత్త చిక్కతాయమ్మ మీద గొడవ చేస్తోంది.

అత్త తలమీద ఇనుపరాడ్ తో దాడి చేసి ?
నువ్వు బెంగళూరులో ఉన్న నీ పెద్ద కొడుకు శివకుమార్ ఇంటికి వెళ్లిపోవాలని సౌమ్యా ఆమె అత్త చిక్కతాయమ్మతో పెద్ద గొడవ చేసింది. ఆ సందర్బంలో అత్తా, కోడలి మద్య పెద్ద గొడవ జరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన సౌమ్యా ఇనుపరాడ్ తీసుకుని ఆమె అత్త చిక్కతాయమ్మ తల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసింది.

అత్తను చితకబాది కోడలు ఎస్కేప్
ఇంట్లో అత్త చిక్కతాయమ్మను చితకబాదిన సౌమ్యా ఆమె ఇద్దరు పిల్లలను పిలుచుకుని ఇంటి నుంచి బయటకు పరుగు తీసింది. స్థానికులకు అనుమానం వచ్చి ఇంటిలోకి వెళ్లి చూడగా చిక్కతాయమ్మ తల పగలిపోయి రక్తపుమడుగులో పడి ఉన్న విషయం గుర్తించి గట్టిగా కేకలు వేశారు. వెంటనే చిక్కతాయమ్మను తుమకూరు జిల్లా ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుణిగల్ పోలీసులు తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications