మైనర్‌పై అత్యాచారం: పాపులర్ నాగిన్ 3 నటుడు పెర్ల్ వీ పూరి అరెస్ట్
ముంబై: ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రముఖ టీవీ నటుడు పెర్ల్ వీ పూరిని శనివారం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నాగిన్ 3 సీరియల్‌తో బాగా ఫేమస్ అయిన పెర్ల్ వీ పూరి.. సీరియల్స్‌లో చెప్పి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఇటీవల ఓ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన పూరీని అరెస్ట్ చేశారు.
ఈ కేసుపై పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదని, పాతదని చెప్పారు. తాజాగా బాధితురాలు.. నటుడిపై ఫిర్యాదు చేసిందని తెలిపారు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెర్ల్ వీ పూరిపై ఐపీసీ 376, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది ఇలావుండగా, పూరి అరెస్టుపై నాగిని-3లో పెర్ల్ వీ పూరికి సహనటిగా పనిచేసిన అనిత స్పందించారు. పెర్ల్ పూరి అలాంటి వ్యక్తి కాదని అన్నారు. తనకు ఎంతో కాలంగా పరిచయం ఉన్న పెర్ల్ వీ పూరి గురించి వచ్చిన వార్తలు విని షాకైనట్లు తెలిపారు. ఇది నిజంకాకపోవచ్చన్నారు. పెర్ల్ చాలా మంచి వ్యక్తని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని భావిస్తున్నట్లు అనిత తెలిపారు.
పెర్ల్ వి పూరి వరుసగా ఏక్తా కపూర్ ప్రొడక్షన్స్ నాగిన్ 3 (2018-19),బెపనా ప్యార్ (2019-20) లలో నటించినందుకు స్టార్‌డమ్ సంపాదించారు. అతను మొట్టమొదట 2013 టీవీ షో దిల్‌కి నాజర్ సే ఖూబ్‌సురత్‌లో కనిపించాడు, ఆ తర్వాత ఫిర్ భీ నా మనే ... బడ్తామీజ్ దిల్, మేరీ సాసు మా, నాగార్జున - ఏక్ యోధా తదితర వాటిలో నటించారు. బ్రహ్మరాక్షసులు-2లో కీలక పాత్ర పోషించారు.












Click it and Unblock the Notifications