కర్ణాటక ఉప ఎన్నికల్లో బ్రహ్మానందం హల్ చల్, తెలుగు ప్రజలు సత్తా చాటాలి, హీరో పవన్ కళ్యాణ్ !
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాగైనా విజయం సాధించాలని నానా తంటాలు పడుతున్నారు. తెలుగు ప్రజులు ఎక్కువగా ఉన్న చిక్కబళ్లాపురంలో అధికారికంగా కన్నడ మాట్లాడినా అధిక శాతం మంది ప్రతిరోజూ తెలుగులోనే మాట్లాడుకుంటారు. ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులోని చిక్కబళ్లాపురంలో ఉప ఎన్నికల వేడి ఎక్కువగా ఉంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి, వపర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిక్కబళ్లాపురంలో ఎన్నికల ప్రచారం చేశారు.
ఇప్పుడు బీజేపీ టిక్కెట్ తో చిక్కబళ్లాపురంలో పోటీ చేస్తున్న అనర్హత ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తరపున ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం చేశారు. బ్రహ్మానందం రోడ్ షోతో చిక్కబళ్లాపురం రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఇప్పుడు సుధాకర్ ను గెలిపించాలని ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడి వచ్చాను, విజయోత్సవం రోజు మళ్లీ ఇక్కడకు వస్తానని బ్రహ్మానందం స్థానికులకు చెప్పారు.

ఉప ఎన్నికల హడావిడి
2018 శాసన సభ ఎన్నికల సమయంలో చిక్కబళ్లాపురం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ మీద పోటీ చేసి గెలుపోంది ఎమ్మెల్యే అయిన డాక్టర్ సుధాకర్ తరువాత ఆయన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సుధాకర్ తరువాత బీజేపీలో చేరారు. సుధాకర్ రాజీనామాతో చిక్కబళ్లాపురంలో శాసన సభ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. చిక్కబళ్లాపురంలో ఉప ఎన్నికల వేడి ఎక్కువైయ్యింది.

బ్రహ్మానందం ఎంట్రీ
హైదరాబాద్ నుంచి ప్రముఖ తెలుగు హాస్య నటుడు డాక్టర్ బ్రహ్మానందం బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరుపున ప్రచారం చెయ్యడానికి చిక్కబళ్లాపురం వచ్చారు. చిక్కబళ్లాపురంలోని ప్రధాన రహదారులతో పాటు అన్ని చోట్ల డాక్టర్ బ్రహ్మానందం రోడ్ షో నిర్వహించి సుధాకర్ కు మీరు ఓటు వేసి గెలిపించాలని స్థానికులకు బ్రహ్మానందం మనవి చేశారు.

బ్రహ్మానందం అంటే మాటలా
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంను చూడటానికి చిక్కబళ్లాపురం ప్రజలు పోటీపడ్డాడు. బ్రహ్మానందం జిందాబాద్ అంటూ తెలుగు ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. చిక్కబళ్లాపురం ప్రధాన రహదారుల్లో బ్రాహ్మానందం రోడ్ షోకు పూలు చల్లి, హారతులు పట్టి స్వాగతం పలికారు. బ్రహ్మానందంతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.

మీ కోసం వచ్చాను
ఎన్నికల ప్రచారం సందర్బంగా జరిగిన రోడ్ షోలో బ్రహ్మానందం స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. సుధాకర్ మీకు డాక్టర్ గా, ఎమ్మెల్యేగా పరిచయం, ఆయన కోసమే తాను హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చానని బ్రహ్మానందం అన్నారు. ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరించే సుధాకర్ కు ఓటు వెయ్యాలని బ్రహ్మానందం స్ధానికులకు మనవి చేశారు. మీరు సుధాకర్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తరువాత జరిగబోయే విజయోత్సవ కార్యాక్రమానికి తాను హాజరౌతానని, ప్రతి తెలుగు వాడు బీజేపీకి ఓటు వేస్తే సుధాకర్ కచ్చితంగా ఎమ్మెల్యే, మంత్రి అవుతారని బ్రహ్మానందం అన్నారు. సుధాకర్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకం తనకు ఉందని బ్రహ్మానందం ధీమా వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్, చిరంజీవి హవా
చిక్కబళ్లాపురం శాసన సభ నియోజక వర్గంలో గతంలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ కిరణ్ తరుపున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆ నియోజక వర్గంలో ప్రచారం చేయించారు. గతంలో చిరంజీవి సైతం ఇక్కడ జరిగిన శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. తెలుగు సినీ నటీ నటులు అంటే చిక్కబళ్లాపురం ప్రజలు ఎంతో ప్రధాన్యత ఇస్తారు. అందుకే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న డాక్టర్ సుధాకర్ సైతం హాస్య నటుడు బ్రహ్మానందంతో చిక్కబళ్లాపురంలో ప్రచారం చేయించారు. ఇటీవల సుధాకర్ తరపున ప్రముఖ బహుబాష నటీ, కన్నడ హీరోయిన్ హరిప్రియా ఎన్నికల ప్రచారం చేశారు. నటి హరిప్రియ ఇదే నియోజక వర్గానికి చెందిన యువతి కావడం విశేషం.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications