నిర్భయ తరహా ఘాతుకం: కదిలే కారులో 2 గంటల పాటు గ్యాంగ్ రేప్!
మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా మృగాళ్ల వికృత చేష్టలకు అడ్డుకట్ట పడటం లేదు. ఢిల్లీ శివార్లలోని ఫరీదాబాద్‌లో ఓ యువతికి ఎదురైన అనుభవం వింటే వెన్నులో వణుకు పుట్టక మానదు. ఆటో కోసం వేచి చూస్తున్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లిఫ్ట్ పేరుతో నరకం చూపారు. కదిలే కారులో రెండు గంటలపాటు సాగిన ఈ పాశవిక కాండ.. దేశ రాజధాని పరిసరాల్లో మహిళల భద్రత ఎంతటి దయనీయ స్థితిలో ఉందో మరోసారి చాటిచెబుతోంది.
ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్‌లో ఈ అమానుష ఘటన వెలుగుచూసింది. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి ఒక యువతిని కారులోకి ఎక్కించుకున్న ఇద్దరు దుండగులు, కదిలే కారులోనే రెండు గంటల పాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేసి, తల పగలగొట్టి అర్థరాత్రి సమయంలో రోడ్డుపై పడేసి పరారయ్యారు.

అసలు ఏం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు తన తల్లితో గొడవపడి, తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో మెట్రో చౌక్ వద్ద ఆటో కోసం వేచి చూస్తోంది. ఆ సమయంలో ఓ కారులో వచ్చిన ఇద్దరు యువకులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి కారులోకి ఎక్కించుకున్నారు. నిందితులు కారును ఫరీదాబాద్ నుండి గురుగ్రామ్ రోడ్డు వైపు తీసుకెళ్లారు. సుమారు రెండు గంటల పాటు కారును రోడ్డుపై తిప్పుతూనే ఉన్నారు. ఒకడు కారు నడుపుతుండగా, మరొకడు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతి గట్టిగా ఎదిరించడంతో ఆమెను విపరీతంగా కొట్టారు. ఆ దాడిలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. అనంతరం బాధితురాలిని కదిలే కారులో నుండి కిందకు తోసేసి నిందితులు పారిపోయారు.
ఈ దారుణంపై బాధితురాలు తన సోదరికి సమాచారం అందించగా.. ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. తీవ్రంగా గాయపడిన యువతిని సివిల్ ఆస్పత్రికి తరలించగా.. ఆమె తలకు 12 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం ఆమె ఫరీదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గాలింపు చేపట్టారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని, ప్రస్తుతం ఫరీదాబాద్‌లోనే నివసిస్తున్నారని పోలీసులు గుర్తించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications