రైతు సంఘాలకు క్లారిటీ లేదు -అందుకే పరిష్కారం కుదరట్లేదన్న తోమర్-సుప్రీం కమిటీకి స్వాగతం

నిరసనలు చేస్తోన్న రైతులకు సాగు చట్టాల విషయంలో క్లారిటీ కొరవడిందని, ప్రతిపాదనల విషయంలో రైతు సంఘాల నేతల అవగాహనలేమి వల్ల చర్చలు ముందుకు సాగడంలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆక్షేపించారు. కనీసం తర్వాతి దశ చర్చల్లోనైనా రైతుల నిర్ణయాత్మక ప్రతిపాదనలతో ముందుకు రావాలన్నారు. రైతు సంఘాలతో శుక్రవారం తొమ్మిదో దశ చర్చలు అసంపూర్తిగా ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు..

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా శుక్రవారం జరిగిన తొమ్మిదో రౌండ్ చర్చలు నిర్ణయాత్మకంగా జరగలేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. 19న మరోసారి చర్చలు జరపనున్నట్టు చెప్పారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చలి వాతావరణంలో రైతులు నిరసనలు తెలపడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు..

Farm laws stir: Govt wants farmers to prepare concrete proposals says minister Tomar

సాగు చట్టాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై కేంద్ర మంత్రి తొలిసారి స్పందించారు. సుప్రీంతీర్పును కేంద్రం స్వాగతిస్తున్నదని, సమస్య పరిష్కారం దిశగా రెండు పక్షాలతో సంప్రదింపుల కోసం సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీని స్వాగతిస్తున్నామని తోమర్ అన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పిలిచినప్పుడు తమ వైపు నుంచి హాజరవుతామన్నారు. రైతు సంఘాల నేతలు మాత్రం సుప్రీం కమిటీ ముందుకు వెళ్ళబోమని, కేంద్రంతోనే అమీ తుమీ తేల్చుకుంటామన్నారు. ఇక..

Farm laws stir: Govt wants farmers to prepare concrete proposals says minister Tomar

రైతులతో కేంద్రం 9వ రౌండ్ చర్చలు జరిపిన శుక్రవారమే.. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ చేపట్టడం, ఆ ర్యాలీలో రాహల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొనడంపై కేంద్ర మంత్రి తోమర స్పందించారు. రాహుల్ గాంధీ ప్రకటనలు, చర్యలు చూసి సొంత పార్టీ వాళ్లే నవ్వుకుంటున్నారని తోమర్ ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ చట్టాలను తీసుకువస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని మరోసారి గుర్తు చేసుకోవాలని తోమర్ విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+