బ్లేమ్ గేమ్ ఆపేయండి: రాజకీయ పార్టీలపై ఘాటుగా షారుక్‌ఖాన్
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ర్యాలీలో రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య చేసుకోవడంపై బాలీవుడ్ నటుడు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారుక్ ఖాన్ గురువారం తీవ్రంగా స్పందించారు.
ఆయన భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ తదితర రాజకీయ పార్టీల పైన నిప్పులు చెరిగారు. రాజకీయ నాయకుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. షారుక్ ఖాన్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో స్పందించారు.
'ఎవరు కూడా తమకు తాము చావాలని కోరుకోరు. ఏదైనా సమస్యలు ఎదురైతేనే అలాంటి చర్యలకు పాల్పడుతారు. ఇలాంటి చర్యలు అడ్డుకునేందుకు చర్యలు తీసుకోండి. వారి బాధలను గుర్తించండి. అంతేకానీ, దీని నుండి లబ్ది పొందే బ్లేమ్ గేమ్ అపేయండి' అని ఘాటుగా స్పందించారు. షారుక్ ఖాన్ ట్వీట్ ఎన్నో రీట్వీట్స్ వచ్చాయి. దీనిపై చాలామంది స్పందించారు.

కేసు బుక్ చేసిన ఢిల్లీ పోలీసులు
రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య పైన ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు. వారు గుర్తు గుర్తు తెలియని వ్యక్తుల పైన కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసులు గజేంద్ర సింగ్‌ను కాపాడేందుకు ప్రయత్నించలేదని ఏఏపీ బుధవారం ఆరోపించింది. మరోవైపు, ఏఏపీ వాళ్లే పోలీసులకు సహకరించలేదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఏఏపీ సహకరించడం లేదు: ఢిల్లీ పోలీసులు
రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో.. ర్యాలీ సమయంలో ఏఏపీ తమకు సహకరించలేదని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ర్యాలీ ప్రాంతం చాలా చిన్నగా ఉందని, ఈ నేపథ్యంలో అక్కడకు తరలి వచ్చిన ఏఏపీ పార్టీ క్యాడర్‌ను కంట్రోల్ చేసేందుకు కష్టమైందని చెబుతున్నారు.
“Nobody kills themselves 2 end their life, they do so 2 end the pain.” Take a moment,feel the pain not look for gain & stop the blame game!
— Shah Rukh Khan (@iamsrk) April 22, 2015 -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications