వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల పైశాచికం: రైతుకు మూత్రం తాగించారు

|
Google Oneindia TeluguNews

ఝాన్సీ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని లలిత్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన మాట విన్లేదని ఓ రైతును చితకబాదిన ఓ పోలీసు అధికారి, అతనితో మూత్రం తాగించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందిత పోలీసు అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు జరిపిన తర్వాత నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి తెలిపారు.

లలిత్‌పూర్ జిల్లాలోని భౌరండాలో కాన్సీరాం అనే రైతుకు కొన్ని ఎకరాల భూమి ఉంది. ఇది మెహ్రోని పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుంది. తన సొంత భూమిలో కూడా వ్యవసాయం చేయనివ్వకపోవడంతో పలువురు గ్రామస్తులపై కాన్సీరాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితునికి అండగా నిలవాల్సిన పోలీసులు అతడ్నే నిందితుడిగా పరిగణించారు.

Farmer made to drink urine by cops in Madhy Pradesh

అంతేగాక కాన్సీరాం తన సొంత భూమిలో వ్యవసాయం చేసుకోకూడదని స్టేషన్ ఆఫీసర్ విజయ్ సింగ్ ఆదేశాలు జారీ చేశాడు. అయితే ఇందుకు కాన్సీరాం నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన విజయ్ సింగ్.. కాన్సీరాంను కానిస్టేబుళ్ల చేత చితకబాదించాడు. అంతటితో ఆగకుండా అతనికి పోలీస్ స్టేషన్‌లో మూత్రం తాగించాడు.. తీవ్ర ఆవేదనకు గురైన బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు పిర్యాదు చేశాడు.

స్పందించిన లలిత్‌పూర్ ఎస్పి విజయ్ యాదవ్ సోమవారం నిందిత ఎస్ఓ విజయ్ సింగ్‌ను పోలీస్ లైన్స్‌కు పంపించారు. ఇలాంటి ఘటనలను తాము సహించబోమని ఎస్పి తెలిపారు. ఘటనపై పూర్తి దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నేరం రుజువైతే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, నిందితుడిపై చర్యలు తీసుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బాధిత రైతు కాన్సీరాం చెప్పాడు.

English summary
A farmer has lodged a complaint against the SO of a police station in Lalitpur, alleging that he was mercilessly beaten and forced to drink urine for defying his orders. The accused police officer has been sent to lines till further orders by the SP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X