తెల్లవారు జామున 6 నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్..
Farmers' protest 2024: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరోసారి ఉత్తరాది రైతులు ఉద్యమించనున్నారు. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు.
2021లో రైతుల ఆందోళన రోజుల తరబడి సాగిన విషయం తెలిసిందే. దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన దీక్షలను కొనసాగించారు. ఏడాదికాలం పాటు వారంతా ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలను కొనసాగించారు. ఇప్పుడు మరోసారి రోడ్డెక్కడానికి సిద్ధపడ్డారు. ఈ నెల 13వ తేదీన ఛలో ఢిల్లీ ఆందోళనకు పిలుపునిచ్చారు.

కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, సంయుక్త్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా.. వంటి 200లకు పైగా రైతు సంఘాలు ఈ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. ఛలో ఢిల్లీ ఆందోళనలో మూడు లక్షల మంది వరకు రైతులు పాల్గొనే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్.. వంటి రాష్ట్రాల నుంచి 500లకు పైగా ట్రాక్టర్లతో ఢిల్లీకి తరలి వెళ్లనున్నారు రైతులు. దీనికోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేపట్టారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పించడంతో పాటు గతంలో తాము ప్రతిపాదించిన తమ డిమాండ్లను పరిష్కరించాలని పట్టుబట్టుతున్నారు.

కేంద్రమంత్రులు పియూష్ గోయెల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్‌తో కూడిన కమిటీ.. రైతు సంఘాల ప్రతినిధులతో జరిపిన తొలి విడత చర్చలు విఫలం అయ్యాయి. అర్ధాంతరంగా ముగిశాయి. రైతు నాయకులు పెట్టిన డిమాండ్లపై ఈ కమిటీ అప్పటికప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఛలో ఢిల్లీ ఆందోళలను విరమించుకోవడానికి నిరాకరించారు.
దీనితో ఈ నెల 13వ తేదీన తలపెట్టిన ఛలో ఢిల్లీ ఆందోళనను యథాతథంగా కొనసాగించాలని తీర్మానించారు. ఈ నేపథ్యంలో- హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. అంబాలా, కురుక్షేత్ర, కైథల్, జింద్, హిసార్, ఫతేబాద్, సిర్సా.. వంటి జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్, మొబైల్ నెట్ వర్క్ కంపెనీలు ప్రొవైడ్ చేసే డోంగల్ సర్వీసులను ఆదివారం తెల్లవారు జామున 6 గంటల నుంచి నిలిపివేయనున్నట్లు తెలిపింది. 13వ తేదీ అర్ధరాత్రి 11:59 నిమిషాల వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండబోవని స్పష్టం చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications