ముఖ్యమంత్రికి చేదు అనుభవం -రైతుల దెబ్బకు సీఎం కాన్వాయ్ రివర్స్

వ్యవసాయ రంగంలో సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు మంగళవారంతో 27వ రోజుకు చేరాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు బైఠాయించగా, వారికి మద్దతుగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆందోళనలను కొనసాగుతున్నాయి. పంజాబ్, హర్యానాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే..

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు రైతుల చేతిలో మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు వెళుతోన్న ఆయనను రైతులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్న రైతులు నల్ల జెండాలు చూపించి నిరసన తెలిపారు. ఒక దశలో సీఎం వాహనాన్ని చుట్టుముట్టి కదలనీయకుండా చేయడంతో పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి.

 farmers protest: Haryana cm Khattars Convoy Turns Around As Farmers Show Black Flags

సీఎం కాన్వాయ్ కి దారి ఇవ్వాలంటూ రైతుల కాళ్లూగడ్డాలు పట్టుకుని పోలీసులు బతిమాలుకున్నారు. నల్లజెండాలు, కర్రలు చేతపట్టిన రైతులను శాంతిపజేసేందుకు అధికారులు కష్టపడాలల్సి వచ్చింది. రైతులు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ వెనుదిరిగి వెళ్లిపోయింది.

హర్యానా సీఎం ఖట్టర్ కు మంగళవారం ఎదురైన ఇదే అనుభవం ఈ నెల 1న కేంద్ర మంత్రి రతన్ లాల్ కటారియాకు కూడా ఎదురైంది. సొంత నియోజకవర్గం అంబాలాలో పర్యటించిన సందర్భంలో కేంద్ర మంత్రి కటారియాకు పలు గ్రామాల్లో రైతులు నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. కొన్ని చోట్ల మంత్రిని అడ్డుకుని కాన్వాయ్ ని వెనక్కి పంపేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+